అమెరికాలో ఎంతో కాలంగా అనుమతికి నోచుకోని కీలక బిల్లుకు అధ్యక్షుడు బిడెన్ సంతకం చేశారు.స్వలింగ సంపర్క అలాగే కులాంతర వివాహాలను చేసుకునేవారికి రక్షణ కల్పించేందుకు, సమానాత్వాన్ని చట్టి చెప్పేలా ఈ బిల్లు రూపొందించబడింది.
ఈ బిల్లు ఆమోదం పొందేందుకు 12 మంది రిపబ్లికన్స్ తో సహా 36 మంది చట్ట సభ్యులు అనుకూలంగా ఓట్లు వేసారు.ఈ బిల్లు ఆమోదం పొందిన తరువాత సభలో బిల్లును ప్రవేశ పెట్టిన సెనేట్ మెజారిటీ లీడర్ చక్ షుమేర్ మాట్లాడుతూ.
ఈ చట్టం ఎంతో కాలం క్రితమే రూపొందించినా ఇప్పుడే ఆమోదం పొందింది.ఈ సమయంలో మనం అందరం ఈ బిల్లుకు మద్దతుగా ఉండటం ఎంతో సంతోషంగా ఉందని అన్నారు.
అమెరికాలో సమానత్వాన్ని చాటి చెప్పేలా ఈ బిల్లు ఉందని అన్నారు.కాగా ఈ కొత్త బిల్లు ప్రకారం ఎవరైనా ఇద్దరు వ్యక్తులు పెళ్లి చేసుకుంటే అది చెల్లు బాటు అయ్యేలా ఆయా రాష్ట్రలలో చెల్లుబాటు అయితే తప్పకుండా ఆ పెళ్లిని గుర్తించాలి అమెరికా రాజ్యాంగం కూడా ఈ పెళ్ళికి గుర్తింపును ఇస్తుంది.
ఈ బిల్లు ద్వారా స్వలింగ సంపర్క వివాహాలు జరుపుకోవడానికి అలాగే కులాంతర వివాహాలు జరుపుకునే వారికి అవసరమయ్యే వస్తువులకు ఇచ్చేందుకు ఇష్టపడని సంస్థలకు రక్షణ కల్పిచేలా కూడా ఈ బిల్లును రూపొందించారు.

ఈ బిల్లుకు మద్దతు తెలిపుతూ అధ్యక్షుడు బిడెన్ సైతం సంతకం చేశారు.స్వలింగ సంపర్కులు ఇకపై స్వేచ్చగా తమకు నచ్చినట్లుగా పెళ్ళిళ్ళు చేసుకోవచ్చు, సంతోషంగా ఉండచ్చు ఈ బిల్లు వారికి రక్షణ కల్పిస్తుందని నచ్చిన వారిని పెళ్లి చేసుకోవడం కంటే సంతోషం ఏముంటుందని బిడెన్ అన్నారు.కాగా ఈ బిల్లు ఆమోదం పొందేందుకు కీలకంగా వ్యవహరించిన సెనేట్ మెజారిటీ లీడర్ చక్ షుమేర్ కు స్వలింగ సంపర్కులు, కులాంతర వివాహాలకు ప్రోశ్చహించే వారు కృతజ్ఞతలు తెలిపారు.