జాతకం చూసి సలార్ సినిమా రిలీజ్ చేస్తున్నారా... ప్రభాస్ జాతకం మార్చేనా?

రెబల్ స్టార్ ప్రభాస్( Prabhas ) నటించిన తాజా పాన్ ఇండియా చిత్రం సలార్ ( Salaar)ఈ సినిమాకు కేజీఎఫ్ సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ( Prashanth Neil ) దర్శకత్వం వహించారు అలాగే ఈ సినిమాని కే జి ఎఫ్ నిర్మాణ సంస్థ హోం భలే ఫిలిం మేకర్స్ వారు ఎంతో ప్రతిష్టాత్మకంగా అత్యంత భారీ బడ్జెట్ సినిమాగా నిర్మించిన సంగతి తెలిసిందే.ఇక ఈ సినిమా ఇప్పటికే విడుదల కావాల్సి ఉండగా కొన్ని కారణాలవల్ల ఈ సినిమా విడుదల వాయిదా పడింది.

 Producer Vijay Kirangadur Interesting Comments About Salaar Release Date, Prabha-TeluguStop.com

దీంతో ఈ సినిమాని డిసెంబర్ 22వ తేదీ విడుదల చేయడానికి సిద్ధమయ్యారు.ఈ క్రమంలోనే ప్రమోషన్ కార్యక్రమాలను కూడా ప్రారంభించారు.

Telugu Salaar, Prabhas, Prashanth Neel, Tollywood-Movie

ఈ క్రమంలోనే నిర్మాత విజయ్ కిరంగదూర్ ( Vijay Kirangadur )ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.పలు విషయాలను వెల్లడించారు.ఇక ఈ సినిమా సెప్టెంబర్ 28వ తేదీ విడుదల కావాల్సి ఉండగా ఎందుకు వాయిదా పడింది అనే విషయాలను మాత్రం వెల్లడించలేదు.అయితే తాజాగా ఈ సినిమా విడుదల తేదీ గురించి నిర్మాత విజయ్ మాట్లాడుతూ చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

ఈ సినిమాని డిసెంబర్ 22వ తేదీ విడుదల చేయడానికి కారణం చెబుతూ.

Telugu Salaar, Prabhas, Prashanth Neel, Tollywood-Movie

మేము జాతకాలను బాగా నమ్ముతాము గత దశాబ్ద కాలం నుంచి సినిమాల విషయంలో మేము అనుసరిస్తున్నటువంటి విధానాన్ని ఈ సినిమా విషయంలోనూ అనుసరించి విడుదల తేదీని ఎంపిక చేసాము అంటూ ఈ సందర్భంగా విజయ్ చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.ఇక ఈయన మాటలు బట్టి చూస్తుంటే జాతకం చూసే ప్రభాస్ సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకు వస్తున్నారా అన్న సందేహాలు అందరిలోనూ వ్యక్తం అవుతున్నాయి.మరి జాతకాలను ఎంతో విశ్వసించే మేకర్స్ ఈ సినిమా ప్రభాస్ జాతకాన్ని పూర్తిగా మార్చేస్తుందా లేక ఏదైనా తేడా కొడుతుందా అన్న సందేహాలు కూడా అందరిలోనూ కలుగుతున్నాయి.

ఎందుకంటే ప్రభాస్ ఈ సినిమా ప్రమోషన్లకు కూడా దూరంగా ఉన్నారు.అంతేకాకుండా ఇటీవల విడుదల చేసిన ట్రైలర్ కూడా ప్రేక్షకులను అనుకున్న స్థాయిలో మెప్పించలేకపోవడంతో ఈ సినిమాపై అభిమానులు కాస్త ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube