హైదరాబాద్ సరూర్ నగర్ లో కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన “యువ సంఘర్షణ( Yuva Sangharshana )” సభలో పాల్గొన్న ప్రియాంక గాంధీ సంచలన వ్యాఖ్యలు చేశారు.జై బోలో తెలంగాణ అంటూ ప్రసంగాన్ని ప్రారంభించిన ఆమె తెలంగాణ మీకు నేల కాదు తల్లి లాంటిది అంటూ ప్రసంగం స్టార్ట్ చేశారు.
మిత్రులారా అంటూ తెలుగులో కొన్ని పదాలు వాడారు.నీళ్లు, నిధులు, నియామకాల కోసం రాష్ట్రం తెచ్చుకున్నాం.
ప్రత్యేక తెలంగాణ కోసం ఎందరో ఆత్మబలిదానాలు చేశారు.ఎంతోమంది కలలుగన్నారు, ప్రాణాలు అర్పించారు.
మా కుటుంబం కూడా ఎన్నో త్యాగాలు చేసింది.త్యాగం అంటే ఏంటో నాకు బాగా తెలుసు.ఆ అమరవీరుల త్యాగం వృధా కాకూడదనే విషయం మాకు తెలుసు.తెలంగాణ రాష్ట్రం ఇచ్చి అధికారంలోకి రావాలని కాంగ్రెస్ అనుకోలేదు.ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా సోనియా ఆనాడు నిర్ణయం తీసుకున్నారు.కానీ అధికారంలోకి వచ్చిన బీఆర్ఎస్ ప్రభుత్వం( BRS party ) ఆ కలలను సాకారం చేయడం లేదు.8,000 మంది రైతుల ఆత్మహత్యలు చేసుకున్నారు.ఉద్యోగ భృతి ఇవ్వలేదు అని ప్రియాంక గాంధీ( Priyanka Gandh ) సీరియస్ వ్యాఖ్యలు చేశారు.
కర్ణాటక ఎన్నికల ప్రచారం పూర్తి చేసుకున్న ఆమె నేరుగా ఈ సభలో పాల్గొన్నారు.తెలంగాణలో ప్రియాంక గాంధీ పాల్గొన్న తొలి బహిరంగ సభలో.భారీ ఎత్తున ప్రజలు హాజరు కావడంతో టీకాంగ్రెస్ నేతలు ఫుల్ సంతోషంగా ఉన్నారు.