కొద్దిరోజుల క్రితం న్యూజిలాండ్‌లో అగ్నిపర్వతం బద్దలై పలువురు మరణించగా, గాలిలోకి ఎగిసిన లావా కొద్దిరోజుల పాటు ఆ ప్రాంతాన్ని కప్పేసిన సంగతి తెలిసిందే.ఈ ఘటనలో భార్యను కోల్పోయిన ఓ భారత సంతతి వ్యక్తి.
నెల రోజుల పాటు మృత్యువుతో పోరాడి చివరికి తుది శ్వాస విడిచాడు.
ప్రతాప్ సింగ్, అతని భార్య మయూరి డిసెంబర్ 9న అగ్నిపర్వతం బద్ధలైనప్పుడు న్యూజిలాండ్‌లోని ప్రఖ్యాత టూరిస్ట్ ప్లేస్ వైట్ ఐలాండ్‌ను సందర్శిస్తున్నారు.
ఈ ప్రమాదంలో మయూరీ డిసెంబర్ 22న మరణించగా.సగం శరీరం కాలిపోవడంతో ప్రతాప్‌ను ఆక్లాండ్‌లోని మిడిల్‌మోర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.ఈ క్రమంలో బుధవారం ఆయన మరణించినట్లు న్యూజిలాండ్ హెరాడ్ల్ వార్తాపత్రిక కథనాన్ని ప్రచురించింది.
నెల రోజుల వ్యవధిలో ప్రతాప్ సింగ్, మయూరి దంపతులు మరణించడంతో వీరి ముగ్గురు పిల్లలు అనాథలయ్యారు.కాగా ఐలాండ్ పర్యటనకు వచ్చిన మయూరీ తల్లి ఓడలోనే వుండిపోవడంతో తృటిలో ప్రాణాలతో బయటపడ్డారు.అగ్నిపర్వతం బద్ధలైన సమయంలో రాయల్ కరేబియన్ క్రూయిజ్‌లో 47 మంది పర్యాటకులు ఉన్నట్లుగా తెలుస్తోంది.
ప్రమాదంలో 13 మంది మరణించగా, 24 మంది వరకు తీవ్రమైన కాలిన గాయాలతో ఆసుపత్రి పాలయ్యారు.
అగ్నిప్రమాదం బద్ధలైన నాటి నుంచి నేటి వరకు మొత్తం 21 మంది ప్రాణాలు కోల్పోయారు.
ప్రతాప్ సింగ్ సేవా ఇంటర్నేషనల్ స్వచ్ఛంద సంస్థకు అట్లాంటా విభాగం అధ్యక్షుడిగా పనిచేస్తున్నారు.కాగా అగ్నిపర్వతం బద్ధలవ్వడానికి దారి తీసిన పరిస్ధితులపై న్యూజిలాండ్ ప్రభుత్వం దర్యాప్తు చేస్తోంది.
విస్ఫోటనం జరగడానికి మూడు వారాల ముందు అది బద్ధలయ్యే అవకాశాలు ఉన్నాయని తెలిసి కూడా ఈ ప్రాంతంలోకి పర్యాటకులను ఎలా అనుమతించారని బాధితుల కుటుంబాలు అధికారులను నిలదీస్తున్నారు.