ఓటుకు నోటు వ్యవహారంపై సుప్రీంలో విచారణ వాయిదా

ఓటుకు నోటు వ్యవహారంపై సుప్రీంకోర్టులో విచారణ వాయిదా పడింది.ఈ విషయంపై తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య దాఖలు చేసిన పిటిషన్ లపై విచారణను ధర్మాసనం ఆగస్ట్ 28వ తేదీకి వాయిదా వేసింది.

 Postponement Of Hearing In The Supreme Court On The Issue Of Notes For Votes-TeluguStop.com

కొన్ని అనివార్య కారణాలతో విచారణ వాయిదా వేయాలని కోరుతూ సుప్రీంకు రేవంత్ రెడ్డి తరపు న్యాయవాదులు విన్నవిస్తూ లేఖ రాశారు.అయితే దీనిపై తమకు ముందస్తు సమాచారం ఏం అందలేదని, కేసు విచారణ వెంటనే చేపట్టాలని ప్రభుత్వ తరపు న్యాయవాదులు కోరారు.

ఈ క్రమంలో కేసు తీవ్రత దృష్ట్యా విచారణ వాయిదా వేయొద్దన్న ప్రభుత్వ లాయర్ల వాదనలపై జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ బేలా, ఎం త్రివేది ధర్మాసనం విముఖత చూపింది.అనంతరం ఆగస్ట్ 28న విచారణ జరుపుతామని మరోసారి వాయిదా కోరవద్దని రేవంత్ రెడ్డి న్యాయవాదులకు కోర్టు సూచించింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube