పెళ్లైన ప్రతి మహిళ అమ్మ అనిపించుకోవాలని కోరుకుంటారనే సంగతి తెలిసిందే.గర్భం దాల్చామనే విషయం తెలిసిన తరువాత మహిళల ఆనందానికి అవధులు ఉండవు.
అయితే బాలీవుడ్ నటి పూనమ్ పాండే గర్భవతి కాకపోయినా గర్భవతి అని ప్రచారం జరగడంతో తీవ్రస్థాయిలో ఫైర్ అయ్యారు.పూనమ్ పాండే సామ్ బాంబే దంపతులు త్వరలో బిడ్డకు జన్మనివ్వనున్నారని ప్రచారం జరగగా ఆ ప్రచారం గురించి పూనమ్ పాండే స్పందించారు.
వైరల్ అవుతున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని పూనమ్ పాండే పేర్కొన్నారు.తప్పుడు కథనాలతో తనను గర్భవతిని చేయవద్దని ఆమె చెప్పుకొచ్చారు.తన ప్రెగ్నెన్సీ గురించి వార్తలు రాసేముందు కనీసం తన స్పందన తెలుసుకుని రాయాలని ఆమె సూచనలు చేశారు.తన లైఫ్ తెరిచిన పుస్తకం అని పూనమ్ పాండే చెప్పుకొచ్చారు.

తాను ప్రెగ్నెంట్ అయిన రోజున మిఠాయిలను పంచుతానని పూనమ్ తెలిపారు.2020 సంవత్సరం సెప్టెంబర్ నెల 1వ తేదీన పూనమ్ పాండే సామ్ బాంబేల వివాహం జరిగింది.పెళ్లి జరిగిన కొన్ని రోజులకే భర్త సామ్ బాంబే తనను చిత్రహింసలు పెడుతున్నాడని పూనమ్ పాండే చెప్పుకొచ్చారు.ఆ తరువాత తన నిర్ణయాన్ని మార్చుకుని పూనమ్ పాండే భర్తపై పెట్టిన కేసును వెనక్కు తీసుకున్నారు.,/br>

వైవాహిక జీవితంలో ఇలాంటి చిన్నచిన్న గొడవలు సాధారణమేనని ఆమె చెప్పుకొచ్చారు.భర్తతో తాను కలిసిపోయానని పూనమ్ పాండే వెల్లడించడం గమనార్హం.పూనమ్ పాండే స్పష్టతనివ్వడంతో ఇకనైనా ఆమె ప్రెగ్నెన్సీకి సంబంధించిన వార్తలు ఆగుతాయేమో చూడాల్సి ఉంది.తన గురించి వైరల్ అయిన వార్తల విషయంలో పూనమ్ పాండే తీవ్రస్థాయిలో మనస్థాపానికి గురయ్యారు.
పదేపదే తను గర్భవతి కాకపోయినా గర్భవతి అంటూ ప్రచారం జరగడంతో స్పందించి వివరణ ఇచ్చి ఆ ప్రచారానికి పూనమ్ పాండే చెక్ పెట్టడం గమనార్హం.