తెలంగాణ రాజీకీయాల్లో ఇప్పుడు ఏం జరిగినా దానికి హుజూరాబాద్‌తో లింకు ఉండటం కామన్ అయిపోయింది.రాజకీయ పార్టీలన్నీ ఇప్పుడ హుజూరాబాద్ వేదికగానే చక్రం తిప్పుతున్నాయి.
ఇంకా నోటిఫికేషన్ కూడా రాకముందే ప్రచారాలతో హోరెత్తిస్తున్నాయి.అయితే బీజేపీ నుంచి ఈటల రాజేందర్ పోటీ చేస్తుండగా.
టీఆర్ ఎస్ నుంచి ఇప్పటి వరకు అభ్యర్థి ఎవరనేది మాత్రం ప్రకటించలేదు.దీంతో అసలు ఎవరు పోటీ చేస్తారనేది ఇప్పటికీ సస్పెన్స్‌గానే ఉంది.
ఈ క్రమంలో ఒకప్పుడు కమలాపూర్ నియోజకవర్గం నుంచి నాలుగుసార్లు ఎమ్మెల్యేగా ఉన్నటువంటి బలమైన పట్టున్న నేత దివంగత మాజీ మంత్రి ముద్దసాని దామోదర్‌రెడ్డి ఫ్యామిలీకే టీఆర్ ఎస్ టికెట్ దక్కుతుందని అంతా అనుకుంటున్నారు.ఇక సీఎం కేసీఆర్ కూడా హుజూరాబాద్‌లో పట్టున్న ఈ కుటుంబానికే ఇస్తారంటూ ఇప్పటికే ప్రచారం జరుగుతోంది.
కాగా దామోదర్ రెడ్డి కుమారుడు అయిన కశ్యప్ రెడ్డి నిన్న హరీశ్‌రావు సమక్షంలో టీఆర్ ఎస్ కండువా కప్పుకున్నారు.దీంతో ముద్దసాని ఫ్యామిలీకే టికెట్ దక్కుతుందనే ప్రచారం బలంగా మారింది.
అయితే దామోదర్‌రెడ్డి అన్న రిటైర్డు కలెక్టర్ పురుషోత్తం రెడ్డి పేరు కూడా ఇప్పటికీ వినిపిస్తూనే ఉంది.

ఈయన ప్రస్తుతం వేములవాడ ఆలయ డెవలప్ మెంట్ అథారిటీ చైర్మన్ గా వ్యవహరిస్తున్నారు.ఈయన్ను పార్టీలో చేర్చుకుని టికెట్ ఇ్వవాలని కేసీఆర్ చూస్తున్నట్టు సమాచారం.తమ్ముడి వారసుడిగా అన్న రాజకీయాల్లోకి వస్తే ఈ నియోజకవర్గంలో బాగానే ఓట్లు పడుతాయని కేసీఆర్ ఆలోచిస్తున్నారు.
కాకపోతే కశ్యప్ కూడా బరిలో ఉండటంతో వీరిద్దరిలో ఎవరికి ఇస్తారనేది ఇంకా ఫైనల్ కాలేదు.కాకపోతే నిన్న కశ్యప్ మాట్లాడుతూ ఎవరికి టికెట్ ఇచ్చిన ఓకే అంటూ చెప్పారు.
ఆయన మాటలను బట్టి చూస్తే వారి ఫ్యామిలీకే టికెట్ వచ్చే అవకాశం ఉంది.ఒకవేళ ముద్దసాని ఫ్యామిలీకి టికెట్ రాకపోతే మాత్రం కెప్టెన్ ఫ్యామిలీకి ఇచ్చే ఛాన్స్ ఉంది.