దేశ ప్రధాని మోదీ ( modi )దేశవ్యాప్తంగా ఉన్న డ్రైవర్లకు గుడ్ న్యూస్ తెలియజేశారు.ట్రక్కు మరియు ట్యాక్సీ డ్రైవర్ల కోసం జాతీయ రహదారుల వెంట ప్రభుత్వం విశ్రాంతి భవనాలు నిర్మిస్తుందని ప్రధాని మోదీ వెల్లడించారు.
ట్రక్కు, టాక్సీ డ్రైవర్లు.దేశ ఆర్థిక వ్యవస్థలో అంతర్భాగమని అన్నారు.
వారు గంట గంటలు డ్రైవింగ్ చేస్తుంటారు.విశ్రాంతి తీసుకోవడానికి సమయం కూడా ఉండదు.
దీంతో రోడ్డు ప్రమాదాలు ఎదురవుతుంటాయి.ఈ రోడ్డు ప్రమాదాలను అరికట్టే విధంగా వారు విశ్రాంతి పొందేలా సకల సౌకర్యాలతో ఆధునిక భవనాలు నిర్మిస్తున్నట్లు ప్రధాని మోదీ స్పష్టం చేశారు.
కేంద్రంలో ఎన్డీఏ 3 హయాంలో ప్రపంచంలో భారత్ మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.ఢిల్లీలో( Delhi ) శుక్రవారం జరిగిన భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్ పోను ఉద్దేశించి ప్రసంగించారు.తాము దేశంలో అధికారంలోకి వచ్చాక ఐదేళ్లలో దేశం ప్రపంచంలో మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదుగుతుందని వ్యాఖ్యానించారు.ఎన్డీఏ హయాంలో గత ఐదేళ్లలో దేశంలో 25 కోట్ల మంది ప్రజలు పేదరికం నుంచి బయటపడ్డారని లెక్కలు బయటపెట్టారు.2047 నాటికి భారత్ అభివృద్ధి చెందిన దేశంగా మారుతుందని వ్యాఖ్యానించారు.మొబిలిటీ రంగానికి ఇది స్వర్ణ యుగమని చెప్పుకొచ్చారు.
ప్రస్తుతం దేశ ఆర్థిక వ్యవస్థ వేగంగా ఎదుగుతున్నట్లు తెలిపారు.