రాజన్న సిరిసిల్ల జిల్లా:ప్రజలు ట్రాఫిక్ నియమాలు పాటిస్తూ వాహనాలు నడపాలి అని రుద్రంగి మండల పోలీస్ హెడ్ కానిస్టేబుల్ బాపిరెడ్డి( Head Constable Bapireddy ) అన్నారు.శుక్రవారం 35వ రోడ్ భద్రత వారోత్సవాల్లో భాగంగా రుద్రంగి మండల కేంద్రంలో ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విద్యార్థిని విద్యార్థులకు ట్రాఫిక్ నియమాలపై అవగాహన కల్పించి,రహదారి ప్రతిజ్ఞ చేపించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజలు రోడ్ భద్రత, ట్రాఫిక్ నియమాలు పాటిస్తూ వాహనాలు నడపాలని, వాహనం నడిపే సమయంలో హెల్మెట్, సిట్ బెల్ట్ తప్పని సరిగా ధరించాలని, ప్రాణం ఎంతో విలువైనది అని మన మీద మన కుటుంబ సభ్యులు ఆధారపడి ఉంటారని మద్యం సేవించి, నిర్లక్ష్యంగా ,ర్యాష్ డ్రైవింగ్,రాంగ్ రూట్ లో ,అవగాహన రాహిత్యంలో వాహనాలు నడుపుతూ ప్రాణాల మీదకి తెచుకోవద్దని అన్నారు.ప్రతి ఒక్కరు డ్రైవింగ్ లైన్సెన్స్ కలిగి ఉండాలని,మైనర్ డ్రైవింగ్ చేయడం నేరం అని మైనర్లకు ఎట్టి పరిస్థితుల్లో వాహనాలు ఇవ్వరాదు అని తెలిపారు.
ఈ కార్యక్రమంలో హెడ్ కానిస్టేబుల్ బాపురెడ్డి, కానిస్టేబుల్ సూర్య, కళాశాల ప్రిన్సిపల్, విద్యార్థులు విద్యార్థులు ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.