Ritu Verma :దయచేసి ఇటువంటి బట్టలు వేసుకోకండి.. రీతూ వర్మకు షాకిచ్చిన నెటిజన్స్?

మామూలుగా ఎప్పుడూ ఒకేలా చూసినా అమ్మాయిలలో మార్పు వస్తే చాలు చూసేవాళ్ళు వెంటనే ట్రోల్ చేయటం మొదలు పెడతారు.అలా సామాన్యులైన సరే ఒక హోదాలో ఉన్న సెలెబ్రిటీలైనా సరే.

 Please Dont Wear Such Clothes Netizens Shocked Ritu Verma-TeluguStop.com

అయితే ఈమధ్య ఇండస్ట్రీకి చెందిన హీరోయిన్లు, చిన్న చిన్న ఆర్టిస్టుల (Artist) లో కూడా చాలా మార్పులు వచ్చాయి.ముఖ్యంగా వారు ధరించే దుస్తుల విషయంలో మాత్రం బాగా మార్పులు వచ్చాయి.

ఒకప్పుడు పద్ధతిగా ఉన్నవాళ్లు ఇప్పుడు బాగా గ్లామర్ షో చేయడంతో వెంటనే వారి పట్ల చూపించిన అభిమానాన్ని తగ్గించేస్తున్నారు.ఇప్పటి హీరోయిన్లలో ప్రతి ఒక్కరు అందాలను ఆరబోస్తున్నారు.

ముఖ్యంగా అవకాశాల కోసం ఆరాటపడుతున్న చిన్నచిన్న హీరోయిన్ లు పొట్టి పొట్టి బట్టలు వేస్తూ బాగా అందాల విందు వడ్డీస్తున్నారు.ఇక రీతూ వర్మ (Reethu Varma) కూడా అలాగే రెడీ అవుతూ షాక్ లు ఇస్తుంది.

తాజాగా కూడా కోటు విప్పి తన అందాలతో రచ్చ చేసింది.

టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన హీరోయిన్ రీతూ వర్మ గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు.

తెలుగు అమ్మాయి అయినా ఈ ముద్దుగుమ్మ తెలుగు ప్రేక్షకులకు బాగా పరిచయమని చెప్పాలి.ఇండస్ట్రీకి అడుగుపెట్టిన తొలినాళ్లలో మంచి మంచి సక్సెస్ లతో పరుగులు తీసింది.

కానీ ఆ తర్వాత ఈ అమ్మడి ఖాతాలో హిట్ అనేది లేకపోయింది.ఇక సోషల్ మీడియా (Social Media) లో యాక్టివ్ గా కనిపిస్తూ ఉంటుంది రీతూ.

తొలిసారిగా యూట్యూబ్ లలో షార్ట్ ఫిలిమ్స్ ద్వారా కెరీర్ మొదలు పెట్టింది రీతూ (Reethu).అలా షార్ట్ ఫిలిమ్స్ ద్వారా తన నటనకు మంచి మార్కులు సంపాదించుకోవటంతో.వెండితెరపై అవకాశాలు కూడా వచ్చాయి.కేవలం నటిగానే కాకుండా ఈమె మోడల్ (Model) గా కూడా చేసింది.అలా రీతు తొలిసారిగా 2013లో విడుదలైన బాద్ షా సినిమాతో వెండితెరపై అడుగు పెట్టింది.

తర్వాత ప్రేమ ఇష్క్ కాదల్ సినిమాలో కూడా నటించింది.అలా.నా రాకుమారుడు, ఎవరే సుబ్రహ్మణ్యం సినిమాల్లో నటించింది.ఇక తమిళ ఇండస్ట్రీలో కూడా అడుగుపెట్టింది రీతూ.అయితే తనకు పెళ్లి చూపులు (Pelli Chupulu) సినిమా బాగా కలిసి వచ్చింది.ఈ సినిమాలో తన నటనకు మంచి మార్కులు సంపాదించుకుంది.అలా ఆ తర్వాత వరుసగా పలు సినిమాలలో నటించింది.

కానీ అంతగా పేరు సంపాదించుకోలేక పోతుంది.చాలావరకు తెలుగు అమ్మాయి కాబట్టి దర్శక నిర్మాతలు కూడా ఈ ముద్దుగుమ్మను అంతగా పట్టించుకోవడం లేదు.

దీంతో అవకాశాల (Offers) కోసం, తనపై దర్శక నిర్మాతల దృష్టి పడటం కోసం ఇష్టం లేకున్నా కూడా గ్లామర్ గా తయారవుతూ మెప్పించే ప్రయత్నం చేస్తూ ఉంది.నిజానికి రీతూ ఎక్కువగా గ్లామర్ షో చేసినట్లు కనిపించదు.

కానీ అవకాశాల కోసం తప్పదు అన్నట్లుగా మెల్లిమెల్లిగా గ్లామర్ వైపు అడుగులు వేస్తుంది.తాజాగా తన ఇంస్టాగ్రామ్ (Instagram) లో కొన్ని హాట్ ఫోటోలు పంచుకుంది.

అందులో షార్ట్ డ్రెస్ (Short Dress) ధరించగా పైనున్న కోటు విప్పేసి తన అందాలను చూపిస్తూ బాగా షో చేసింది.కానీ ఆమె ఫేస్ లో మాత్రం అంత లుక్ లేదు.నిజానికి తనకు గ్లామర్ డ్రెస్ లు సెట్ కావు.కానీ అవకాశాల కోసం తప్పదు అన్నట్లుగా తయారవుతుంది.ఇక ఆ ఫోటోలు చూసి.దయచేసి మీరు ఇటువంటి బట్టలు వేసుకోకండి అంటూ అభిమానులు (Fans) సలహాలు ఇస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube