తెలంగాణ నూతన సచివాలయం ప్రారంభ తేదీపై హైకోర్టులో పిటిషన్ దాఖలైంది.ఈ నెల 17న సెక్రటేరియట్ ను ప్రారంభించడాన్ని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ హైకోర్టులో సవాల్ చేశారు.
ఈ మేరకు సచివాలయాన్ని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ పుట్టిన రోజు అయిన ఏప్రిల్ 14న ప్రారంభించాలని పిటిషన్ లో పేర్కొన్నారు.ప్రతివాదులుగా సీఎంవో, సీఎస్ ను చేర్చిన కేఏ పాల్… పార్టీ ఇన్ పర్సన్ గా వాదనలు వినిపిస్తామని వెల్లడించారు.