టీడీపీ విడుదల చేసిన పుస్తకంపై మాజీమంత్రి పేర్నినాని తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు.సీఎం జగన్ పై విషపు రాతలతో పుస్తకం వేశారని అన్నారు.
ముఖ్యమంత్రి వ్యక్తిత్వాన్ని దెబ్బ తీసేందుకే ఆ పుస్తకమంటూ మండిపడ్డారు.
ఆ పుసక్తంపై కనీసం టీడీపీ అని కూడా పేరు వేసుకోలేదని పేర్ని నాని తెలిపారు.
టీడీపీ ఒక అంతర్జాతీయ పార్టీ .దానికో ఏపీ అధ్యక్షుడని చెప్పారు.అచ్చెన్నాయుడుకి బాడీ తప్ప బుర్ర ఉండదని విమర్శించారు.మాజీ మంత్రి వివేకానంద రెడ్డి హత్య జరిగినప్పుడు ఎవరి ప్రభుత్వం ఉందని పేర్ని నాని ప్రశ్నించారు.వివేకా కూతురు చెప్పిన అంశాలపై విచారణ ఎందుకు జరపలేదన్నారు.అవినాశ్ రెడ్డిపై ఇప్పుడు విమర్శలు చేస్తున్న వారు.
అప్పుడు పేరు ఎందుకు చేర్చలేదని అడిగారు.వైఎస్ వివేకా హత్య కేసులో ప్రతిపక్షం విష ప్రచారం చేస్తోందని తీవ్రస్థాయిలో మండిపడ్డారు.