సీఎం జగన్ కి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసిన పవన్ కళ్యాణ్..!!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పుట్టినరోజు కావటంతో పార్టీ నాయకులు కార్యకర్తలు భారీ ఎత్తున జరుపుతున్నారు.ముఖ్యంగా 50వ జన్మదినోత్సవం సందర్భంగా.

 Pawan Kalyan Wishes Cm Jagan On His Birthday, Pawan Kalyan, Ys Jagan,cm Jagan Bi-TeluguStop.com

అన్ని నియోజకవర్గాలలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు విదేశాలలో సైతం…వైసీపీ కార్యకర్తలు జగన్ అభిమానులు ఈ పుట్టినరోజు వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నారు.

ఇక ఇదే సమయంలో పలువురు కేంద్ర మంత్రులు ఇంకా ప్రధాని మోడీ ఇతర రాష్ట్రాల ముఖ్యమంత్రులు జగన్ కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది.

తాజాగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సైతం సీఎం జగన్ కి బర్తడే విషెస్ తెలియజేస్తూ ప్రకటన విడుదల చేశారు.”ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు.ఆ భగవంతుడు మీకు ఆయురారోగ్యాలు ప్రసాదించాలని మనసారా కోరుకుంటున్నాను” అని పవన్ శుభాకాంక్షలు తెలియజేశారు.

 దీంతో ఈ ప్రకటన సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube