కాలగమనం లో 2022వ సంవత్సరం కలవబోతోంది.మరికొన్ని రోజుల్లో 2023వ సంవత్సరం రాబోతుంది.
కొత్త సంవత్సరం వస్తున్న ప్రతి సారి కూడా పాత సంవత్సరం లో వచ్చిన సినిమాలు.అవి సాధించిన సక్సెస్ లు ఫెయిల్యూర్స్ ఇలా ప్రతి ఒక్కటి లెక్కలు వేసుకోవడం మనం చూస్తూనే ఉంటాం.
ఈ సంవత్సరం కూడా టాలీవుడ్ బాక్సాఫీస్ వద్ద వందల కొద్ది సినిమాలు వచ్చాయి.ఇండియన్ బాక్సాఫీస్ వద్ద భారీ ఎత్తున సినిమాలు విడుదలయ్యాయి.
కానీ ఎక్కువ శాతం సినిమాలు నిరాశ పర్చాయి.కొన్ని మాత్రం రికార్డు స్థాయిలో కలెక్షన్స్ నమోదు చేసుకున్నాయి.
రెండు సినిమా లు 1000 కోట్లకు పైగా వసూలు సాధించిన విషయం తెల్సిందే.అంతే కాకుండా ఈ ఏడాది విడుదల కాగా కాంతార వంటి సూపర్ హిట్ సినిమా భారీ వసూళ్ల ను సొంతం చేసుకుంది.
విక్రమ్ కూడా తమిళనాడు ఇండస్ట్రీ హిట్ సాధించింది.అయితే ఈ సంవత్సరం లో అత్యంత దారుణమైన డిజాస్టర్ గా నిలిచిన చిత్రం ప్రభాస్ నటించిన రాధేశ్యామ్ సినిమా అనడం లో సందేహం లేదు.ఆ సినిమా ఏకంగా రూ.500 కోట్ల నుండి రూ.1000 కోట్ల కలెక్షన్స్ రాబడుతుందని అంతా భావించారు.కానీ కనీసం వంద కోట్ల కలెక్షన్స్ కూడా రాబట్టలేక పోయింది.
ప్రభాస్ ఆల్ ఇండియా స్థాయిలో గుర్తింపు దక్కించుకున్న కారణంగా అక్కడక్కడ అన్నిచోట్ల భారీ కలెక్షన్స్ నమోదు చేసే అవకాశం ఉందని భావించినప్పటికీ ఎక్కడ కూడా మినిమం కలెక్షన్స్ రాబట్టలేదు.ముఖ్యంగా ఉత్తర భారతంలో కనీసం 10 కోట్ల కలెక్షన్స్ కూడా రాబట్టలేక రాధేశ్యామ్ సినిమా ఢీలా పడి పోయింది.
అత్యంత దారుణమైన కలెక్షన్స్ చూసి ప్రభాస్ అభిమానులు సైతం ముక్కున వేలేసుకున్నారు.అయితే అదృష్టవశాత్తు రాధేశ్యామ్ సినిమా ను ముందుగానే అమ్మేయడం తో నిర్మాతలు యూవీ క్రియేషన్స్ వారు లక్కీగా తక్కువ నష్టాలతో బయటపడ్డారు.