పవర్ స్టార్ పవన్ కళ్యాణ్( Pawan Kalyan ) ప్రస్తుతం వరుస సినిమాలలో నటిస్తూనే మరోవైపు రాష్ట్ర రాజకీయాలలో చాలా చురుగ్గా పాల్గొంటున్నారు.ఈ క్రమంలోనే ఈయన వారాహి యాత్ర( Varahi Yatra ) ను ప్రారంభించిన విషయం మనకు తెలిసిందే.
ఈ యాత్రలో భాగంగా జూన్ 16వ తేదీ పవన్ కళ్యాణ్ కాకినాడ జిల్లా పిఠాపురంలో పర్యటించారు.ఈ యాత్రలో భాగంగా పవన్ కళ్యాణ్ యువతను ఉద్దేశిస్తూ పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.
ఈ క్రమంలోనే పవన్ కళ్యాణ్ చేసిన ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఈ సందర్భంగా యువతను ఉద్దేశిస్తూ పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ యువత సినిమాల పరంగా ఏ హీరో నైనా అభిమానించవచ్చు అందులో ఏమాత్రం తప్పులేదు.ఇండస్ట్రీలో తమకు నచ్చిన హీరోని,వారి సినిమాలను చూడటంలో తప్పులేదు కానీ రాజకీయ విషయానికి వస్తే రాష్ట్ర ప్రయోజనాల కోసం సరైన నాయకుడిని ఎన్నుకునే విషయంలో యువత ఆలోచించాలని పవన్ కళ్యాణ్ సూచించారు.ఎప్పుడు కూడా సినిమా( Cinima ) రాజకీయాలు( Politics ) రెండు ఒకటి కాదని సినిమా వేరు రాజకీయం వేరని ఈయన తెలియజేశారు.
ఒక నటుడిగా తనకు సినిమా ఇండస్ట్రీలో తోటి హీరోలు అంటే చాలా గౌరవం నేను ఇతర హీరోల సినిమాలను కూడా చూస్తానని తెలిపారు.నాకు రామ్ చరణ్( Ramcharam ) చిరంజీవి( Chiranjeevi ) అంటే ఇష్టం.అలాగే జూనియర్ ఎన్టీఆర్ ( Ntr ) ప్రభాస్ ( Prabhas ) అన్న కూడా ఇష్టమేనని వారి సినిమాలను కూడా తాను చూస్తాను అంటూ ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ టాలీవుడ్ హీరోల గురించి చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.ఇక ఈయన ఒకవైపు వారాహి యాత్ర చేపడుతూనే మరోవైపు సినిమా షూటింగ్ పనులలో కూడా బిజీ అవుతున్న సంగతి మనకు తెలిసిందే.