చిరుతో కలిసి నటించనున్న పవన్ కళ్యాణ్.. ఆ పాత్రల్లో ఈసారి ఫిక్స్?

మెగాస్టార్ చిరంజీవి తన సెకండ్ ఇన్నింగ్స్ తర్వాత వరుస సినిమాలతో ఎంతో బిజీగా ఉన్నారు.ఈ క్రమంలోనే మెగాస్టార్ 154 వ చిత్రాన్ని దర్శకుడు కె.

 Pawan Kalyan Act In Chiranjeevi Fix In Those Roles This Time, Chiranjeevi , Pawa-TeluguStop.com

ఎస్.రవీంద్ర దర్శకత్వంలో తెరకెక్కిస్తున్నారు.ఈ చిత్రం నిన్న ఎంతో ఘనంగా ప్రారంభమైంది.ఈ క్రమంలోనే తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాలో చిరంజీవి వీరయ్య పాత్రలో నటిస్తున్నట్లు తెలుస్తోంది.ఇక ఇందులో చిరంజీవి తమ్ముడి పాత్ర కీలకంగా ఉండబోతుందని ఈ పాత్రలో నటించడానికి చిత్రబృందం చిరు సోదరుడు పవన్ కళ్యాణ్ సంప్రదించినట్లు తెలుస్తోంది.

ఇదివరకే రవీంద్ర దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ సర్దార్ గబ్బర్ సింగ్ సినిమా చేశారు.

ఈ క్రమంలో వీరి మధ్య మంచి స్నేహం ఉందని, ఈ పాత్రలో నటించడానికి పవన్ కళ్యాణ్ సరిగ్గా సెట్ అవుతారని భావించిన చిత్ర బృందం ఆయనను సంప్రదించినట్లు తెలుస్తోంది.ఇక పవన్ కళ్యాణ్ ఈ సినిమాకి గ్రీన్ సిగ్నల్ ఇస్తే ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించనున్నాట్లు తెలుస్తోంది.

ఈ సినిమాలో చేయడానికి పవన్ కూడా ఆసక్తి కనబరుస్తున్నట్లు సమాచారం.

Telugu Heros, Tollywood-Movie

అయితే ఇందులో పవన్ కళ్యాణ్ పాత్ర ఏంటి? ఎలా ఉండబోతుంది అనే ఈ విషయాలను గోప్యంగా ఉంచనున్నట్లు తెలుస్తోంది.ఇక ఈ సినిమా విషయానికి వస్తే వైజాగ్ పోర్ట్ నేపథ్యంలో యాక్షన్ థ్రిల్లర్ గా ఈ చిత్రం తెరకెక్కుతుందని తెలుస్తోంది.ఇక ప్రస్తుతం మెగాస్టార్ గాడ్ ఫాదర్ సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నారు.

ఇక మెగాస్టార్ నటించిన ఆచార్య విడుదలకు సిద్ధంగా ఉంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube