Sunrisers Hyderabad Team : సన్ రైజర్స్ హైదరాబాద్ టీమ్ గత సీజన్లలో చేసిన తప్పే మళ్లీ చేస్తుందా..?

గత కొద్ది సంవత్సరాలుగా సన్ రైజర్స్ హైదరాబాద్ టీమ్( Sun Risers Hyderabad Team ) ఏమాత్రం తన ప్రభావాన్ని చూపించలేక పోతుంది.ఇక దాంతో టీమ్ లో ఎవరిని కొనసాగించాలి, ఎవరిని పక్కన పెట్టాలి అనే విషయం మీద కూడా వాళ్లకి ఒక క్లారిటీ అయితే రావడం లేదు.ఇక రీసెంట్ గా 2023 లో జరిగిన మినీ యాక్షన్ లో 20.50 కోట్లు పెట్టి కొనుగోలు చేసిన పాట్ కమ్మిన్స్ ని ఈసారి కెప్టెన్ గా నియమిస్తూ సన్ రైజర్స్ యాజమాన్యం కీలక నిర్ణయాన్ని తీసుకుంది.ఇక దీన్ని అధికారికంగా కూడా ఈరోజు ప్రకటించింది.అయితే గత సీజన్ లో కెప్టెన్ గా వ్యవహరించిన ఎయిడెన్ మర్కరం ను పక్కకు తప్పించి ఈ సీజన్ కోసం పాట్ కమ్మిన్స్ ని రంగంలోకి దించుతుంది.

 Pat Cummins Sunrisers Hyderabad Team Opted For New Captain-TeluguStop.com

ఇక హైదరాబాద్ టీం గత కొద్ది సంవత్సరాలుగా చేస్తున్న తప్పునే ఇప్పుడు కూడా రిపీట్ చేస్తుంది అంటూ ఆరెంజ్ ఆర్మీ అభిమానులు( Orange Army Fans ) సన్ రైజర్స్ టీం మీద విపరీతమైన ట్రోల్లింగ్స్ అయితే చేస్తున్నారు.

Telugu Aiden Markram, Ipl, Kaviya Maran, Pat Cummins-Sports News క్రీడ

అది ఏంటి అంటే సౌతాఫ్రికా టి 20 లీగ్ లో రెండుసార్లు టీమ్ ను విజేతగా నిలిపిన మార్కరం ని ఐపీఎల్( IPL ) లో కూడా కెప్టెన్ గా చేస్తూ గత సీజన్ లో అతనికి కెప్టెన్ గా బాధ్యతలు అప్పగించారు.ఇక ఇక్కడి వరకు బాగానే ఉంది కానీ గత సీజన్ లో మార్కరం( Aiden Markram ) కెప్టెన్ గా ఏమాత్రం ప్రతిభ చూపించలేకపోయాడు.అయినప్పటికీ తనని కెప్టెన్ గా కొనసాగిస్తే బాగుండేది అని అభిమానులు ఆశిస్తున్నారు.

ఎందుకంటే సీజన్ కి ఒక కొత్త కెప్టెన్ ను నియమించుకుంటూ పోతే టీం లో ఉన్న లోటుపాట్ల గురించి ఎవరికి పూర్తి అవగాహన ఉండదు.దానివల్ల టీమ్ కి భారీగా నష్టం జరిగే అవకాశాలు కూడా ఉన్నాయి అంటూ ఎస్ ఆర్ హెచ్ టీమ్ యజమాని అయిన కావ్య మారన్( Kaviya Maran ) పైన సెటైర్లు అయితే వేస్తున్నారు…

Telugu Aiden Markram, Ipl, Kaviya Maran, Pat Cummins-Sports News క్రీడ

ఇక మరి కొంతమంది మాత్రం ఈ టీమ్ లో డేవిడ్ వార్నర్, కేన్ విలియమ్సన్ ఇద్దరు కీలకమైన ప్లేయర్ గా ఉండేవారు.వీళ్లిద్దరి కెప్టెన్సీలో హైదరాబాద్ టీమ్ ఘన విజయాలను అందుకుంది.ఇక వార్నర్ కెప్టెన్సీ( Warner Captaincy ) లో అయితే 2016లో ఏకంగా కప్పు కూడా గెలుచుకుంది.

అలాంటి వాళ్ళని టీం నుంచి దూరం చేసుకొని ఎవరో ఏదో చేస్తారు అంటూ కొత్త వాళ్ళని టీం లోకి తీసుకొచ్చి వాళ్ల మీద ఆశలు పెట్టుకోవడం అనేది సన్ రైజర్స్ టీమ్ చేస్తున్న పెద్ద తప్పు అంటూ మరి కొంతమంది వాళ్ళ అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు.ఇక మొత్తానికైతే ఈ సీజన్ లో పాట్ కమ్మిన్స్( Pat Cummins ) రాణిస్తాడా హైదరాబాద్ టీమ్ కి కప్పు తీసుకొచ్చి పెడతాడా లేదా అనే విషయాలు తెలియాలంటే మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే…

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube