దొంగకి చుక్కలు చూపించిన ట్రైన్ ప్యాసింజర్.. వీడియో వైరల్...

దొంగలు ప్రజల నిర్లక్ష్యాన్ని, అలాగే బలహీనతలను సద్వినియోగం చేసుకుంటూ వారి దగ్గర నుంచి విలువైన వస్తువులను కొట్టేస్తున్నారు.అయితే ఒక్కోసారి వీరిని ప్రజలు పట్టుకుని దేహశుద్ధి చేస్తున్నారు.

 Passengers Grab Phone Snatcher Through Train Window In Bihar Video Viral Details-TeluguStop.com

మరికొన్నిసార్లు ఊహించని రీతిలో దొంగలకు( Thieves ) చుక్కలు చూపిస్తున్నారు.వీటికి సంబంధించిన వీడియోలో అప్పుడప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

తాజాగా ఓ ఫోన్ స్నాచింగ్( Phone Snatching ) వీడియో ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారింది.కదులుతున్న రైలలోని ప్రయాణికుడి ఫోన్‌ను కిటికీలోంచి దొంగిలించడానికి ఒక దొంగ ప్రయత్నించాడు.

అయితే అప్రమత్తమైన ప్రయాణికుడు దొంగను పట్టుకున్నాడు.దాంతో దొంగ రైలు బయట వేలాడుతూ నరకం అనుభవించాల్సిన దుస్థితి ఏర్పడింది.

ఇలాంటి నేరాలు తరచుగా జరిగే భారతదేశంలోని బీహార్‌లో( Bihar ) ఈ వీడియో షూట్ చేయడం జరిగింది.బీహార్‌లోని భాగల్‌పూర్( Bhagalpur ) సమీపంలో కదులుతున్న రైలు నుంచి ఆ వ్యక్తి ఫోన్‌ను దొంగిలించడానికి ప్రయత్నించాడని వీడియో క్యాప్షన్‌లో తెలియజేశారు.కానీ ప్రయాణికుడు అప్రమత్తమై ఆ వ్యక్తి చేతిని పట్టుకుని కిటికీలోంచి వేలాడదీశాడు.తప్పించుకోవడానికి కష్టపడిన వ్యక్తిని పట్టుకోవడానికి ఇతర ప్రయాణికులు కూడా సహాయం చేశారు.అతడిని రక్షించేందుకు కొందరు వచ్చేలోపే రైలు అతడిని కిలోమీటరు మేర ఈడ్చుకెళ్లింది.ఈ ఘటనను కొందరు ప్రయాణికులు( Passengers ) చిత్రీకరించి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.

బీహార్‌లో ఇలాంటివి జరగడం ఇదే మొదటిసారి కాదు.2022లో మరో వ్యక్తి సాహెబ్‌పూర్ కమల్ స్టేషన్‌లో రైలు కిటికీలోంచి ఫోన్ దొంగిలించడానికి ప్రయత్నించాడు.అయితే ప్రయాణికులు వెంటనే స్పందించి అతడి చేయి పట్టుకున్నారు.రైలు కదలడం ప్రారంభించినా అతన్ని వెళ్లనివ్వలేదు రైలుకు వేలాడుతూ దాదాపు 10 కిలోమీటర్లు ప్రయాణించాల్సి వచ్చింది.

ఎట్టకేలకు రైలు బీహార్‌లోని మరో నగరమైన ఖగారియా సమీపంలోకి చేరుకోవడంతో అతన్ని విడుదల చేశారు.స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం విడిచిపెట్టిన వెంటనే అతడు పారిపోయాడు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube