Paruchuri Gopala Krishna : భోళా శంకర్ లో అది ప్రమాదకరంగా మారింది.. షాకింగ్ కామెంట్స్ చేసిన పరుచూరి గోపాలకృష్ణ?

మెహర్ రమేష్( Meher Ramesh ) దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించిన చిత్రం భోళా శంకర్( Bhola shankar ).ఇందులో తమన్నా హీరోయిన్ గా నటించగా, కీర్తి సురేష్ చిరంజీవి చెల్లెలుగా నటించిన విషయం తెలిసిందే.

 Paruchuri Gopala Krishna Talks About The Movie Bhola Shankar-TeluguStop.com

హీరో సుశాంత్ కూడా ఇందులో కీలక పాత్రలో నటించారు.భారీ అంచనాల నడుమ విడుదలైన ఈ సినిమా ఊహించని విధంగా డిజాస్టర్ గా నిలిచింది.

చిరంజీవి కెరీర్ లోనే బిగ్గెస్ట్ ఫ్లాప్ సినిమాగా నిలిచింది.ఇక ఈ సినిమా విడుదల తర్వాత చిరంజీవిపై అలాగే దర్శకుడు రమేష్ పై ఏ రేంజ్ లో ట్రోలింగ్స్ నెగిటివ్ కామెంట్స్ వచ్చాయో మనందరికీ తెలిసిందే.

మెగా అభిమానులు చిరు పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.ఆ సంగతి పక్కన పెడితే తాజాగా ఈ సినిమా పట్ల ప్రముఖ రచయిత పరుచూరి గోపాలకృష్ణ ( Paruchuri gopala krishna )స్పందించారు.

Telugu Bhola Shankar, Keerthy Suresh, Meher Ramesh, Paruchurigopala, Tollywood,

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.భోళా శంకర్ అన్నా చెల్లెళ్ల కథ కాదు.చెల్లెలు కాని అమ్మాయిని తన చెల్లిగా భావించి చేరదీసిన ఒక అన్న కథ.నిజానికి ఇది అద్భుతమైన పాయింట్‌.ఈ సినిమా మాతృక వేదాళం మూవీలో దీనికి ప్రేక్షకాదరణ బాగా దక్కి ఉంటుంది.కోల్‌కతా బ్యాక్‌గ్రౌండ్‌లో తీసిన సినిమాలపై ప్రాంతీయత బాగా ప్రభావం చూపుతుంది.ఇది మన ప్రాంతానికి చెందిన కథలా లేదు అనే భావన ప్రేక్షకులకు వచ్చినట్లైతే వాళ్లు సినిమాకు డిస్‌కనెక్ట్‌ అవుతారు.భోళా శంకర్‌ మొదట్లోనే ఇది కోల్‌కతా కథ అని చూపించారు.

దీంతో ఇది మన కథ కాదనే భావన నాకు కలిగింది.తమిళ సినిమాలు రీమేక్‌ చేసినా మన ప్రాంతీయతకు తగ్గట్లు వాటిలో మార్పులు చేయాలి.

Telugu Bhola Shankar, Keerthy Suresh, Meher Ramesh, Paruchurigopala, Tollywood,

కానీ, ఈ చిత్రబృందం ఆ విధంగా ఎందుకు మార్పులు చేయలేదో నాకు అర్థం కాలేదు.ఈ సినిమా ప్రధానంగా మాన‌వ అక్ర‌మ ర‌వాణాను అంతం చేసిన హీరో కథ.గతంలో అన్నా చెల్లి సెంటిమెంట్‌ మీద రక్తసంబంధం, ఆడపడుచు ఇలా ఎన్నో సినిమాలు వచ్చాయి.ఈ సెంటిమెంట్‌తో వచ్చే కథల రూట్‌ మ్యాప్‌ వేరుగా ఉంటుంది.

కానీ, భోళా శంకర్‌ మూవీ లో ఒకవైపు మాఫియాను అణచివేసే హీరోను చూపిస్తూనే మరోవైపు అన్నా చెల్లెళ్ల సెంటిమెంట్‌ను చూపించారు.దీంతో రెండు పడవల మీద ప్రయాణం చేశారా అనే అనుమానం కలిగింది.

దాన్ని తెలివిగా చూపించవచ్చు.మొదటి భాగమంతా హత్యలు చూపించి రెండో భాగంలో వాటిని ఎందుకు చేశారో చెబితే జనాలకు అర్థం కాదు అని తెలిపారు పరుచూరి గోపాలకృష్ణ.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube