ఈ స్కూటర్ ని చూస్తే ఎవరైనా అవాక్కవ్వాల్సిందే!

సోషల్ మీడియాలో ప్రతీరోజూ కొన్ని వందల వీడియోలు వైరల్ అవుతుంటాయి.సోషల్ మీడియా వచ్చినప్పటి నుండి ఏ వీడియో.ఎప్పుడు… ఎందుకు వైరల్ అవుతుందో మనకు తెలియదు.అందులో ఎన్నో రకాల వీడియోలు ఉంటాయి.

 Parked Scooter Started Moving Without Driver Viral Video Details, Scotter, Viral-TeluguStop.com

అసలు మనం గమనించని చిన్న విషయాలు కూడా సోషల్ మీడియాలో తెగ వైరలవుతుంటాయి.అలాంటి ఒక వీడియోనే ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతుంది.

ఈ వీడియోను చూస్తే ఎవరైనా ఆశ్చర్యపోకుండా ఉండలేరు.

వైరల్ అవుతున్న ఈ వీడియోలో రోడ్డు పక్కన ఒక స్కూటర్ పార్క్‌ చేసి ఉంటుంది.

అయితే కొద్దిసేపటి తర్వాత ఆ స్కూటర్ దానంతట అదే తిరగడం మనం గమనించవచ్చు.అలా స్కూటర్ దానంతట అదే గుండ్రంగా తిరుగుతూ మళ్లీ పార్కింగ్‌ చేసిన చోటికే వచ్చి ఆగుతుంది.

సీసీటీవీలో రికార్డైన ఈ ఘటన ప్రజలను ఆశ్చర్యానికి గురిచేస్తోంది.అసలు మనిషి లేకుండా స్కూటర్ దానంతట అదే తిరగడంతో ఈ వీడియో సోషల్‌ మీడియాలో తెగ వైరల్‌ అవుతోంది.

ఈ షాకింగ్ వీడియో చూసిన కొందరు నెటిజన్లు దీనిని ‘దెయ్యం స్కూటర్’గా పిలుస్తున్నారు.

కొంతమంది అయితే దీని వెనుక ఏదో మర్మం దాగుందని అంటున్నారు.కాగా, ఈ వీడియోని ఇప్పటివరకు 1 మిలియన్ కంటే ఎక్కువ మంది వీక్షించగా… 43 వేల మందికి పైగా లైక్‌ చేశారు.అదే సమయంలో నెటిజన్లు ఈ వీడియోపై వివిధ రకాల రియాక్షన్‌లు ఇస్తున్నారు.

ఈ ఘటనను కొందరు అద్భుతం అని, మరికొందరు దెయ్యం చేసిందని కామెంట్ చేస్తున్నారు.ఏది ఏమైనప్పటికీ ఈ వీడియో ఇప్పడు నెట్టింట్లో హల్‌చల్‌ చేస్తుంది.

మీరు కూడా ఈ వీడియోని చూసినట్లయితే మీ కామెంట్ తప్పకుండా తెలియజేయండి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube