సోషల్ మీడియాలో ప్రతీరోజూ కొన్ని వందల వీడియోలు వైరల్ అవుతుంటాయి.సోషల్ మీడియా వచ్చినప్పటి నుండి ఏ వీడియో.
ఎప్పుడు.ఎందుకు వైరల్ అవుతుందో మనకు తెలియదు.
అందులో ఎన్నో రకాల వీడియోలు ఉంటాయి.అసలు మనం గమనించని చిన్న విషయాలు కూడా సోషల్ మీడియాలో తెగ వైరలవుతుంటాయి.
అలాంటి ఒక వీడియోనే ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతుంది.ఈ వీడియోను చూస్తే ఎవరైనా ఆశ్చర్యపోకుండా ఉండలేరు.
వైరల్ అవుతున్న ఈ వీడియోలో రోడ్డు పక్కన ఒక స్కూటర్ పార్క్ చేసి ఉంటుంది.
అయితే కొద్దిసేపటి తర్వాత ఆ స్కూటర్ దానంతట అదే తిరగడం మనం గమనించవచ్చు.
అలా స్కూటర్ దానంతట అదే గుండ్రంగా తిరుగుతూ మళ్లీ పార్కింగ్ చేసిన చోటికే వచ్చి ఆగుతుంది.
సీసీటీవీలో రికార్డైన ఈ ఘటన ప్రజలను ఆశ్చర్యానికి గురిచేస్తోంది.అసలు మనిషి లేకుండా స్కూటర్ దానంతట అదే తిరగడంతో ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
ఈ షాకింగ్ వీడియో చూసిన కొందరు నెటిజన్లు దీనిని 'దెయ్యం స్కూటర్'గా పిలుస్తున్నారు.
"""/"/కొంతమంది అయితే దీని వెనుక ఏదో మర్మం దాగుందని అంటున్నారు.కాగా, ఈ వీడియోని ఇప్పటివరకు 1 మిలియన్ కంటే ఎక్కువ మంది వీక్షించగా.
43 వేల మందికి పైగా లైక్ చేశారు.అదే సమయంలో నెటిజన్లు ఈ వీడియోపై వివిధ రకాల రియాక్షన్‌లు ఇస్తున్నారు.
ఈ ఘటనను కొందరు అద్భుతం అని, మరికొందరు దెయ్యం చేసిందని కామెంట్ చేస్తున్నారు.
ఏది ఏమైనప్పటికీ ఈ వీడియో ఇప్పడు నెట్టింట్లో హల్‌చల్ చేస్తుంది.మీరు కూడా ఈ వీడియోని చూసినట్లయితే మీ కామెంట్ తప్పకుండా తెలియజేయండి.
ఎండు రొయ్యలు వర్సెస్ పచ్చి రొయ్యలు.. ఆరోగ్యానికి ఏది బెస్ట్?