మరోసారి హిందువుల మనోభావాలను దెబ్బ తీసిన పాకిస్తాన్!

మైనారిటీ పరిరక్షణ గురించి ఇంటర్నేషనల్ సదస్సులలో గొంతు చించుకునే పాకిస్తాన్ తమ దేశంలో మైనారిటీలను ఎలా ఏడిపించుకొని తింటుందో రోజూ మీడియాలో కథనాలు చూస్తూనే ఉంటాం.ఇక తాజాగా మరోమారు పాకిస్తాన్ ఆ దేశంలో మైనారిటీలైన హిందువుల మత విశ్వాసాలను దెబ్బతీసే విధంగా కరాచీలోని ఒక పురాతన హనుమాన్ ఆలయాన్ని బుల్డోజర్లతో కూలగొట్టారు.

 Pakistan Behaviour On Minorities, Pakisthan, India, Minorities, Hindhu Temples,-TeluguStop.com

అంతేకాకుండా అక్కడ నివాసముంటున్న దాదాపు 20 హిందూ కుటుంబాల ఇళ్లను కూడా కూలగొట్టారు.ఈ విషయం తెలిసిన పాకిస్తాన్ హిందువులు పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తున్నారు.

దానితో ఆ ప్రాంతాన్ని పోలీసులు సీజ్ చేశారు.

వివరాలలోకి వెళ్తే పాకిస్తాన్‌లోని ఇస్తాంబుల్‌లో ఉన్న ఒక చారిత్రాత్మక చర్చిని మసీదుగా మార్చే ప్రయత్నంలో ఈ ఘటన చోటుచేసుకుందని అంతేకాకుండా అక్కడున్న చర్చిని, హనుమాన్ ఆలయాన్ని ఒకేసారి కూలగొట్టారని పాకిస్తాన్ మీడియా ప్రొజెక్ట్ చేస్తుంది.

ప్రస్తుతం ఉన్న సమాచారం మేర లియారి అసిస్టెంట్ కమిషనర్ అబ్దుల్ కరీం ఈ ఆలయాన్ని కూల్చివేసిన బిల్డర్‌పై విచారణకు ఆదేశించినట్లు సమాచారం.

భారత్ లో ఏదైనా చిన్న సంఘటన జరిగితే మైనారిటీలకు అన్యాయం జరుగుతుందని దొంగ ఏడుపులు ఏడ్చే పాకిస్తాన్.

మరి తమ దేశంలో మైనారిటీల పైన జరిగే ఇలాంటి సంఘటనల పై ఎందుకు నోరు మెదపదో ఎవరికీ తెలియదు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube