కరీంనగర్ లో పాదయాత్ర... బీజేపీ నేత బండి సంజయ్ కీలక ప్రకటన..!!

తెలంగాణ బీజేపీ నాయకుడు బండి సంజయ్( Bandi Sanjay ) కీలక వ్యాఖ్యలు చేశారు.మరికొద్ది నెలలో తెలంగాణలో జరగబోయే పార్లమెంట్ ఎన్నికలకు కరీంనగర్( Karimnagar ) నుంచే బీజేపీ ఎంపీ ఎన్నికల శంఖారావం ప్రారంభం అవుతుందని పేర్కొన్నారు.

 Padayatra Bjp Leader Bandi Sanjay Key Announcement In Karimnagar Details, Bjp,-TeluguStop.com

ఈనెల 28న బీజేపీ కార్యకర్తల సమ్మేళనం జరుగుతుందని వ్యాఖ్యానించారు.ఈ కార్యక్రమానికి కేంద్ర హోం మంత్రి అమిత్ షా( Amit Shah ) హాజరవుతారని స్పష్టం చేశారు.

అదేవిధంగా వచ్చేనెల 5వ తారీఖు నుంచి కరీంనగర్ లో పాదయాత్ర చేయబోతున్నట్లు బండి సంజయ్ సంచలన ప్రకటన చేశారు.

పాదయాత్ర( Padayatra ) 20 రోజులు జరుగుతుందని జిల్లాలో అన్ని మండలాలలో పర్యటిస్తానని స్పష్టం చేశారు.తెలంగాణలో జరగబోయే లోక్ సభ ఎన్నికలులో( Loksabha Elections ) బీఆర్ఎస్ మూడో స్థానానికి పరిమితం అవుతుందని వ్యాఖ్యానించారు.అసెంబ్లీ ఎన్నికలలో బీఆర్ఎస్ నీ ప్రజలు ఛీ కొట్టిన ఆ పార్టీ నేతలకు అహంకారం తగ్గలేదని విమర్శించారు.

పార్లమెంట్ ఎన్నికల్లో ప్రజలు మరోసారి బుద్ధి చెబుతారని.బీఆర్ఎస్ కి ఘోర పరాజయం తప్పదని అన్నారు.

ఇదే సమయంలో సర్పంచ్ పెండింగ్ బిల్లులు విడుదలకు వెంటనే కాంగ్రెస్ ప్రభుత్వం ఉత్తర్వులు ఇవ్వాలని అన్నారు.ఈనెల 28న అమిత్ షా మధ్యాహ్నం ఒంటిగంటకు బేగంపేట్ విమానాశ్రయానికి చేరుకుని అక్కడ నుంచి నేరుగా ప్రత్యేక హెలికాప్టర్ లో మహబూబ్ నగర్ బయలుదేరుతారు.మధ్యాహ్నం ఒంటి గంట 50 నిమిషాల నుంచి రెండు గంటల 40 నిమిషాల వరకు మహబూబ్ నగర్ సమావేశంలో పాల్గొంటారు.అనంతరం కరీంనగర్ లో బీజేపీ ఎంపీ ఎన్నికల శంఖారావం కార్యక్రమానికి హాజరవుతారని వ్యాఖ్యానించారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube