చదువుకి టాలెంటుకి అసలు సంబంధమే లేదని మన ఏపీకి చెందిన వ్యకి ఒకరు తాజాగా నిరూపించారు.అవును, కరోనా గడ్డుకాలం తరువాత జనాలను బాధిస్తున్న విషయాలలో ఆయిల్ ధరలు ప్రధానమైనవి.
దాంతో వినియోగదారులు పెట్రోల్ వాహనాలకు బదులుగా ప్రత్యామ్నాయ మార్గాలను అనుసరిస్తున్నారు.ఈ క్రమంలో ఎలక్ట్రిక్ వాహనాలకు మార్కెట్లో మంచి గిరాకీ ఏర్పడింది.
దాంతో అనేక వాహన తయారీ కంపెనీలు పుట్టగొడుగుల్లాగా పుట్టుకొచ్చాయి.అంతేకాకుండా కొంతమంది ఔత్సాహికులు సొంతంగానే వెహికల్స్ రూపొందిస్తున్నారు.
ఈ క్రమంలోనే పల్నాడు జిల్లా పిడుగురాళ్లకు చెందిన షేక్ చిన్న మస్తాన్ ఆయిల్ అవసరం లేని ఒక వాహనాన్ని రూపొందించి ఎంచక్కా దానిపై చక్కర్లు కొడుతున్నాడు.షేక్ చిన్న మస్తాన్ ఓ సాధారణ మోటార్ మెకానిక్.సంపాదించిన దాంట్లో సగం పెట్రోల్ కే పోతుందని రోజూ బాధపడుతుండేవాడు షేక్.ఈ క్రమంలోనే అతనికి అదిరిపోయే ఓ ఆలోచన వచ్చింది.పెట్రోల్ అవసరం లేకుండా సోలార్ శక్తితో నడిచే బైక్ ని తయారు చేశారు.దానికి బైక్ మీద ఒక సోలార్ ప్యానెల్ ను అమర్చి.
బైక్ సీట్ కింద ఒక బ్యాటరీని అమర్చాడు.
ఇంకేముంది… కట్ చేస్తే, ఈ బైక్ దర్జాగా 80 కి.మీ.మైలేజ్ ఇస్తోంది.అంతేకాకుండా రాత్రిపూట కూడా ఈ బైక్ మీద ప్రయాణించే వీలు కలిగేలా బ్యాటరీకి ఛార్జింగ్ పెట్టుకోవచ్చునని అంటున్నారు.2 గంటలు ఛార్జింగ్ పెడితే.80 కి.మీ.ప్రయాణం చేయవచ్చునని అతగాడు చెబుతున్నాడు.కాగా ఈ సోలార్ బైక్ మీద నలుగురు కూర్చుని కూర్చోవచ్చు.
కాగా దీని కోసం ఆయనకు లక్షా 20 వేలు ఖర్చు అయినట్లు వెల్లడించారు.ఇక రానున్న రోజుల్లో సోలార్ తో నడిచే ఆటోని కూడా తయారు చేస్తానని మన షేక్ చెబుతున్నాడు.