TDP Chandrababu Naidu : ఒక ఫ్యామిలీ ఒకటే టికెట్ .. ఈ టీడీపీ సీనియర్ల పరిస్థితేంటి ? 

టిడిపి అధినేత చంద్రబాబు తాజాగా తీసుకున్న నిర్ణయం  ఆ పార్టీ సీనియర్ నేతలకు మింగుడు పడడం లేదు.వచ్చే ఎన్నికల్లో టిడిపి, జనసేన, బిజెపి కలిసి పోటీ చేసే అవకాశం ఉండడం తో కచ్చితంగా గెలిచి అధికారంలోకి వస్తామనే నమ్మకం టిడిపి నేతల్లో కనిపిస్తోంది.

 One Family Is One Ticket What About The Situation Of These Tdp Seniors-TeluguStop.com

దీంతో టిడిపి( TDP ) సీనియర్ నేతలు తమతో పాటు , తమ వారసులను రంగంలోకి దించేందుకు సిద్ధమవుతున్నారు.

Telugu Ap, Janasena, Janasenani, Jc Asmith Reddy, Ke Syam Babu, Paritala Sriram,

 ఇప్పటికే టికెట్ ఆశిస్తున్న నియోజకవర్గాల్లో తమ వారసులతో ప్రచారం చేయిస్తూ ప్రజలకు దగ్గర అయ్యే విధంగా వ్యూహాలు రచిస్తున్నారు.అయితే ఈ విధంగా ఒకే కుటుంబంలో రెండు మూడు టికెట్లు ఆశిస్తున్న నాయకుల సంఖ్య ఎక్కువగా ఉండడంతో,  టిడిపి అధినేత చంద్రబాబు( Chandrababu naidu ) తాజాగా ఓ కీలక నిర్ణయం తీసుకున్నారు.ఒక కుటుంబానికి ఒకటే టికెట్ ఇస్తామని చంద్రబాబు ప్రకటించడంతో,  సీనియర్ నేతలు అయోమయంలో పడ్డారు.

ముఖ్యంగా సీనియర్ నేతలుగా ఉన్న చింతకాయల అయ్యన్నపాత్రుడు , జెసి దివాకర్ రెడ్డి,  కోట్ల సూర్య ప్రకాష్ రెడ్డి,  పూసపాటి అశోక్ గజపతిరాజు,  కేఈ  ,పరిటాల సునీత వంటి నాయకులు తమ వారసులను పోటీకి దింపేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు.చింతకాయల అయ్యన్నపాత్రుడు నర్సీపట్నం నియోజకవర్గం నుంచి పోటీ చేసే ఆలోచనతో ఉన్నారు.

ఆయన కుమారుడు చింతకాయల విజయ్ కు అనకాపల్లి ఎంపీ టికెట్ ఇవ్వాల్సిందిగా చంద్రబాబును కోరుతున్నారు.

Telugu Ap, Janasena, Janasenani, Jc Asmith Reddy, Ke Syam Babu, Paritala Sriram,

 పరిటాల సునీత( Paritala Sunitha ) రాప్తాడు నుంచి కొడుకు శ్రీరామ్ ను ధర్మవరం నుంచి పోటీ చేయించాలని చూస్తున్నారు.తన కుమారుడికి మళ్లీ టిక్కెట్ కేటాయించాలని ఆమె కోరుతున్నారు.  కేఈ కుటుంబానికి వస్తే కేఈ ప్రతాప్ లేదా కేఈ ప్రభాకర్ డోన్ అసెంబ్లీ టికెట్ తో పాటు,  కేఈ కృష్ణమూర్తి కుమారుడు శ్యాంబాబు పత్తికొండ సీటును ఆశిస్తున్నారు.

ఇక మాజీ కేంద్రమంత్రి సీనియర్ నేత పూసపాటి అశోక్ గజపతిరాజు తనతో పాటు తన కుమార్తె అదితిని ఎమ్మెల్యేగా పోటీ చేయించాలని చూస్తున్నారు.జెసి కుటుంబంలో జెసి పవన్ రెడ్డి జేసీ అస్మిత్ రెడ్డి( JC Asmith Reddy ) అనంతపురం ఎంపీ ,తాడిపత్రి ఎమ్మెల్యే టికెట్లు ఆశిస్తున్నారు.

ఇంకా అనేక మంది సీనియర్ నేతలు తమ వారసులను పోటీకి దింపేందుకు సిద్ధమవుతుండడంతో, అనవసర తలనొప్పులు తలెత్తుతాయనే ఉద్దేశంతో ముందుగానే చంద్రబాబు ఒక కుటుంబానికి ఒకటే టికెట్ అని తేల్చి చెప్పేయడంతో చంద్రబాబు తీరుపై సీనియర్ నేతలు ఆగ్రహంతో ఉన్నారట.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube