Police Story Movie : పోలీస్ స్టోరీ సినిమాని ప్రమోట్ చేయనన్న చిరంజీవి.. ఎందుకంటే..

1996లో థ్రిల్లర్ మంజు దర్శకత్వంలో తెరకెక్కిన “పోలీస్ స్టోరీ”( Police Story ) సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.ఈ యాక్షన్ ఫిల్మ్‌లో సాయి కుమార్, శోబరాజ్, సత్య ప్రకాష్ తదితరులు నటించారు.

 Chiranjeevi Said No To Police Story Promotion-TeluguStop.com

ఈ మూవీలో సాయి కుమార్ వేసిన అగ్ని పాత్ర( Agni Role ) బంపర్ హిట్ అయింది.ఈ సినిమాకి ముందు వరకు సాయి కుమార్ పెద్దగా గుర్తింపు తెచ్చుకోలేదు.

అందువల్ల మేకర్స్ ఎవరైనా పెద్ద హీరోతో ఈ మూవీని ప్రమోట్ చేయించాలనుకున్నారు.అప్పుడు సాయి కుమార్ చిరంజీవి వద్దకు వెళ్లి తాను నటించిన “పోలీస్ స్టోరీ” సినిమా గురించి కొన్ని మంచి మాటలు చెప్పాలని అడిగాడు.

దాంతో “ఏదైనా అడుగు కానీ ఇలాంటివి అడిగి ఇబ్బంది పెట్టకు రా” అని చిరంజీవి వెంటనే అనేసాడట.ఈ విషయాన్ని తాజాగా సాయికుమార్ ఒక ఇంటర్వ్యూలో వెల్లడించాడు.


-Movie

కానీ సాయి కుమార్( Sai Kumar ) పట్టుబట్టడంతో చిరు మరింత కోపడ్డాడట.“మూవీ బాగుందని చెప్పేస్తే నా మాట విని చాలామంది ప్రేక్షకులు సినిమా చూసేందుకు వెళ్తారు.తీరా సినిమా బాగోలేకపోతే నన్ను తిట్టుకుంటారు.ఆ తలనొప్పిలన్ని ఎందుకురా” అని సాయికుమార్ ని పంపించే ప్రయత్నం చేశాడట చిరంజీవి.సాయి కుమార్ మాత్రం “అన్నయ్య మీరు చెప్పాల్సిందే, నా సినిమాని ప్రమోట్ చేయాల్సిందే” అని పట్టు పట్టాడట.“కావాలంటే సినిమాని చూడండి, నచ్చితే నచ్చిందని, లేకపోతే లేదని చెప్పమ”ని చిరంజీవి( Chiranjeevi )ని బతిమిలాడట.అప్పట్లో చిరంజీవి హిట్లర్ వంటి సినిమాలు తీస్తూ సూపర్ బిజీగా ఉన్నాడు.


-Movie

అయితే సాయికుమార్ మాట కాదనలేక పోలీసు స్టోరీ సినిమా చూస్తానని హామీ ఇచ్చాడు.తర్వాత సాయి కుమార్ అన్నపూర్ణ స్టూడియో( Annapurna Studio )లో చిరంజీవి పోలీస్ స్టోరీ సినిమా చూసేందుకు అన్ని ఏర్పాట్లు చేశాడు.ఒకరోజు చిరంజీవి తన భార్యతో కలిసి “పోలీస్ స్టోరీ” సినిమా చూసేందుకు అన్నపూర్ణ స్టూడియోకి వచ్చాడు.

మూవీ చూశాక చిరంజీవి రెండు నిమిషాలు సైలెంట్ గా ఉన్నాడట.తర్వాత కుర్చీలోంచి లేచి సాయికుమార్ మెడ పట్టుకొని “అరేయ్ ఏం నటించావ్‌ రా, సినిమా సూపర్.

నేను దీని గురించి ఒక వీడియో చేసి ప్రమోట్ చేస్తాన”ని మాటిచ్చాడట.ఆ విధంగా చిరు తమ సినిమాని ప్రచారం చేశారని సాయికుమార్ చెప్పుకొచ్చాడు.ప్రస్తుతం ఆయన చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube