చాగల్లు మండలం చంద్రవరం గ్రామంలో 39 వ రోజు గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో హోంమంత్రి తానేటి వనిత గారు పాల్గొన్నారు.గ్రామ సచివాలయంలో సర్పంచ్, వాలంటరీలు, ఇతర శాఖల అధికారులతో హోంమంత్రి సమావేశం అయ్యారు.
గ్రామంలో జరుగుతున్న అభివృద్ధి పనులు, నవరత్నాల పథకాల అమలు గురించి చర్చించారు.అనంతరం గ్రామంలో ఇంటింటికి వెళ్లి జగనన్న ప్రభుత్వం వచ్చిన ఈ మూడు సంవత్సరాల కాలంలో లబ్ధిదారులకు అందుతున్న సంక్షేమ పథకాల గురించి అడిగి తెలుసుకున్నారు.
సీఎం జగన్ గారు పెన్షన్ ఇచ్చి తమను ఆదుకుంటున్నారని గ్రామం లోని వృద్ధులు హోంమంత్రి తానేటి వనిత గారికి వివరించారు.సొంత పిల్లలే తమని పట్టించుకోకుండా వదిలి వెళ్లారని.
సీఎం జగన్ కొడుకులా, మనవడిలాగా అండగా ఉన్నాడని వృద్ధులు సంతోషం వ్యక్తంచేశారు.గ్రామంలో ఎక్కడికి వెళ్లినా వృద్ధులు ఆప్యాయంగా హోంమంత్రి తానేటి వనిత గారిని పలకరిస్తూ.
బాగోగులు అడిగి తెలుసుకున్నారు.
చంద్రవరం గ్రామంలో గడప గడపకు కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వ పాఠశాల ను హోంమంత్రి తానేటి వనిత పరిశీలించారు.
పాఠశాలలో ఉన్న విద్యార్థులతో కలిసి ముచ్చటించారు.పిల్లకు స్కూల్ బ్యాగ్ కిట్, మద్యాహ్న భోజనం, ఇతర వసతుల గురించి అడిగి తెలుసుకున్నారు.
నాడు నేడు లో భాగంగా తమ స్కూల్ రేపురేఖలు పూర్తిగా మారిపోయాయని, రుచికరమైన మధ్యాహ్నం భోజనం తింటున్నామని పిల్లలు సంతోషంగా హోంమంత్రి కి వివరించారు.దీనికంతా కారణం ఎవరని హోంమంత్రి గారు అడుగగా.
జగన్ మామయ్య అంటూ ఆనందముతో పిల్లలు సమాధానం ఇచ్చారు.అనంతరం స్కూల్ విద్యార్థులతో హోంమంత్రి తానేటి వనిత గారు సరదాగా ముచ్చటించారు.