రూ. 42 కోట్ల రూపాయిల లాటరీ కొట్టేసిన పెద్దాయన.. ఎక్కడంటే?

Old Man Won The Lottery Of 42 Crore Rupees In , Colorado Lottery, Old Man, Lottery, Colorado State, America, Watermelon, Colorado Lottery, Waldimer Budd, Colorado Lotto+ Jackpot, Viral News, Trending News , Colorado

తాజాగా ఓ పెద్దాయన ఒకటి కాదు, రెండు కాదు ఏకంగా రూ.42 కోట్ల రూపాయిల లాటరీ గెలుచుకున్నాడు.తంతే బంగారు గంపలో పడడం అంటే ఇదే.అమెరికాలోని కొలరాడో రాష్ట్రానికి చెందిన ఓ పెద్దాయనకు లాటరీలో ఏకంగా రూ.42 కోట్ల జాక్‌పాట్ తగలడంతో అతని ఆనందానికి అవధులే లేకుండా పోయాయి.ఈ భారీ మొత్తం అందుకోగానే ఆయన ముందుగా తన కోసం ఓ వాటర్‌మెలన్‌, భార్య కోసం పూలు కొనుగోలు చేశాడట.

 Old Man Won The Lottery Of 42 Crore Rupees In , Colorado Lottery, Old Man, Lo-TeluguStop.com

కొలరాడో( Colorado ) లాటరీ తెలిపిన వివరాల ప్రకారం మాంట్రోజ్‌కు చెందిన వాల్డిమర్ బడ్ టీ(77) కొలరాడో లొట్టో+ జాక్‌పాట్( Colorado Lotto+ jackpot ) విన్నర్‌గా నిలచి 5 మిలియన్ డాలర్లకు పైగా ప్రైజ్ మనీ సొంతం చేసుకున్నట్టు తెలుస్తోంది.

రిటైరైన బడ్ హాలిడే ట్రిప్‌కు వెళ్లి వెచ్చిన తర్వాత వెబ్‌సైట్‌లో తాను కొనుగోలు చేసిన టికెట్‌ను చెక్ చేయగా ఈ జాక్‌పాట్ తగిలిందని తెలుసుకున్నాడు.అయితే ఒక్కసారిగా పొరపాటేమోనని తటపటాయించాడట.77 ఏండ్ల బడ్‌కు ప్రయాణాలంటే విపరీతమైన ఆసక్తి.బడ్( Waldimer Budd ) ఆమె భార్య ప్రతి ఏటా ఆరు నెలలు అరిజోనాలో మరో ఆరునెలలు కొలరాడోలో నివసిస్తుంటారు.కొలరాడోలో ఉండగా తాను ప్రతినెలా కొలరాడో లొట్టో+ ఆడతానని చెప్పుకొచ్చాడు.

తన లక్కీనెంబర్స్‌తో లాటరీ టికెట్లను కొనే ఫార్ములాను అనుసరిస్తానని అన్నాడు.

జాక్‌పాట్ కొట్టిన టికెట్‌ను మాంట్రోజ్‌లోని హ్యాంగిన్‌ ట్రీ ట్రావెల్ ప్లాజాలో బడ్ కొనుగోలు చేసినట్టు తెలిపాడు.సింపుల్ లైఫ్‌ను లీడ్ చేసే బడ్ దంపతులు జాక్‌పాట్ డబ్బుతో ఏం చేయాలనేది ఇంకా ప్లాన్ చేసుకోలేదని సమాచారం.కొన్ని ఛారిటీలకు కొంత మొత్తం ఇస్తానని, ఈ డబ్బుతో తాను ఏం చేయాలో ఆలోచిస్తానని ఈ సందర్బంగా అతగాడు స్థానిక మీడియాతో చెప్పుకొచ్చాడు.

Old Man, Lottery, Colorado State, America, Watermelon, Colorado Lottery, Waldimer Budd, Colorado Lotto+ Jackpot, Viral News, Trending News - Telugu America, Coloradolotto, Colorado, Lottery, Budd, Watermelon #TeluguStopVideo

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube