పాలమూరు ప్రజల దశాబ్దాల కల నెరవేరబోతుంది.బీడు బారిన నేలపై కృష్ణమ్మ పరవళ్లు తొక్కనుంది.
ఈ మేరకు పాలమూరు -రంగారెడ్డి ఎత్తిపోతల ప్రాజెక్ట్ ప్రారంభోత్సవానికి సర్వం సిద్దం అయింది.
ఈ క్రమంలో మధ్యాహ్నం నార్లాపూర్ వద్ద ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ వద్ద నుంచి ప్రాజెక్టును సీఎం కేసీఆర్ ప్రారంభించనున్నారు.
తరువాత ఇంటెంక్ వద్ద కృష్ణా జలాలకు కేసీఆర్ ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు.కాగా ఈ ఎత్తిపోతల పథకం ప్రాజెక్టును తెలంగాణ ప్రజలకు అంకితం ఇవ్వనున్నారు.
అనంతరం సింగోటం చౌరస్తా వద్ద ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభకు కేసీఆర్ హాజరుకానున్నారు.సభా స్థలం వద్ద ప్రాజెక్టు ప్రారంభోత్సవానికి సంబంధించి భారీ స్క్రీన్ పై ప్రచారం చేయబోతున్నారు.
అదేవిధంగా ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా వ్యాప్తంగా అన్ని గ్రామ పంచాయతీలకు ఎంపీడీవోల ద్వారా కృష్ణా జలాలను గ్రామ సర్పంచ్ లకు అందించనున్నారు.ఈ క్రమంలోనే ఆ జలాలతో గ్రామ దేవతల కాళ్లు కడిగి అభిషేకాలు నిర్వహించనున్నారు.







