అమెరికాలో( America ) ఒక విషాద సంఘటన చోటుచేసుకుంది.ఆ దేశానికి ఉపాధి కోసం వెళ్లిన హైదరాబాద్ వాసి అకాల మరణం చెందాడు.
ఇతడు కొద్ది నెలల క్రితం డెలివరీ ఏజెంట్‌గా జాయిన్ అయ్యాడు.పనిలో భాగంగా రీసెంట్ గా ఓ ప్యాకేజీని డెలివరీ చేయడానికి వెళ్ళాడు.
ఆ సమయంలో ప్రమాదవశాత్తూ స్విమ్మింగ్ పూల్‌లో పడి మునిగిపోయి ప్రాణాలు విడిచాడు.ఈ ఘటనతో ఆ ఎన్నారై కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొన్నది.
వివరాల్లోకి వెళ్తే, మహ్మద్ ముస్తఫా షరీఫ్ ( Mohammad Mustafa Sharif )అనే 31 ఏళ్ల భారతీయుడు గత కొద్ది రోజులుగా అట్లాంటాలో ఫుడ్ డెలివరీ పర్సన్‌గా వర్క్ చేస్తున్నాడు.షరీఫ్ కుటుంబం యొక్క ఇమ్మిగ్రేషన్ స్టేటస్ పై ఆధారపడిన వీసాపై అమెరికాకు వచ్చాడు.తొమ్మిది నెలల క్రితం ఆ దేశంలో అడుగుపెట్టిన షరీఫ్ కుటుంబం కోసం బాగా డబ్బులు వెనకేయాలని అనుకున్నాడు.కానీ ఊహించని రీతిలో అతడికి ప్రాణాలను స్విమ్మింగ్ పూల్ పక్కన పెట్టుకుంది.
దాంతో అతని భార్య తాహెరా బాను కన్నీరు మున్నీరవుతోంది.ఈ దంపతులకు ఇద్దరు చిన్న పిల్లలు ఉన్నారు.
వారు షెజాద్ (2 ఏళ్లు), హంజా (5 నెలల వయస్సు).ఇంత చిన్న వయసులో వారు తండ్రిని కోల్పోవడంతో చాలామంది అయ్యో పాపం అంటున్నారు.
వారి భవిష్యత్తు ఇలా మారడం చాలా బాధాకరమని విచారం వ్యక్తం చేస్తున్నారు.
మహ్మద్ ముస్తఫా షరీఫ్ అన్నయ్య నవాజ్ షరీఫ్ ( Nawaz Sharif )ఈ సంఘటనపై దిగ్బ్రాంతిని వ్యక్తం చేశాడు.ఆయన ప్రకారం, ముస్తఫా ఫుడ్ డెలివరీ చేసిన లొకేషన్ ను ఫోటో తీయాలనుకున్నాడు.కంపెనీ నిబంధనల ప్రకారం ఫోటో తీయడం తప్పనిసరి.
అయితే ముస్తఫా ఫోటో తీయడానికి ప్రయత్నిస్తున్న సమయానికే చీకటి పడింది.ఏమీ కనిపించకపోవడంతో అతడు సమీపంలో ఉన్న 10 నుంచి 12 అడుగుల లోతు ఉన్న స్విమ్మింగ్ పూల్‌లో జారి పడిపోయాడు.
ఈత రాకపోవడంతో అందులో మునిగి మృత్యువాత పడ్డాడు.అతడు చనిపోయిన గంట తర్వాత ఇంటి యజమాని అతడిని గుర్తించి పోలీసులకు సమాచారం అందించాడు.
ఇండియాలోని షరీఫ్ ఫ్యామిలీ యూఎస్‌లోని భారత రాయబార కార్యాలయం, కాన్సులేట్ జనరల్ ఆఫ్ ఇండియా (CGI) అట్లాంటాలను తాజాగా సంప్రదించింది.షరీఫ్ అంత్యక్రియలకు హాజరయ్యేందుకు ఎమర్జెన్సీ విషాదం జారీ చేయాలని వారు విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జైశంకర్ సహాయం కోరారు.