తెలుగులో చిరంజీవితో ఆపద్బాంధవుడు సినిమాలో హీరోయిన్ గా నటించిన మీనాక్షి శేషాద్రి చాలా మందికి తెలుసు.ఆ రోజులు బాలీవుడ్ లో తన అందంతో ఒక ఊపు ఊపిన ఈ భామ తెలుగులో మొదటి సినిమానే చిరంజీవితో చేసే ఛాన్స్ సొంతం చేసుకుంది.
ఆపద్బాంధవుడు సినిమాలో ఆమె నటనతో ప్రసంశలు కూడా లభించాయి.ఈ సినిమాతర్వాత ఎన్టీఆర్ విశ్వామిత్ర సినిమాలో మేనకగా ఒక సాంగ్ లో కనిపించి సందడి చేసింది.
కెరియర్ పీక్ లో ఉన్నప్పుడే పెళ్లి చేసుకొని సెటిల్ అయిపోయిన మీనాక్షి తరువాత పెద్దగా మీడియాకి కనిపించలేదు.సినిమాలలో కూడా నటించలేదు.
ఈ మధ్య సోషల్ మీడియా ప్రభావం వలన అందరికి అందుబాటులో ఉంటుంది.
ఇదిలా ఉంటే అమెరికాలో సెటిల్ అయిన ఈ భామ తాజాగా ఒక పోస్ట్ పెట్టింది.
తన డ్రైవింగ్ లైసెన్స్ రెన్యువల్ చేయించుకునేందుకు వెళ్లి గంటల తరబడి లైనులో నిలుచుంది.అయిన కూడా అక్కడ ఎవరు కూడా ఆమెను గుర్తుపట్టలేదు.ఈ విషయాన్ని ఆమె తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా తెలియజేసింది నేను 8 గంటలపాటు లైన్ లో నిలబడి వెయిట్ చేశాను.అయినా ఎవరూ నన్ను గుర్తుపట్టలేదు.
ఇది అమెరికా ఇక్కడ ఇలానే ఉంటుంది అని రాశారు.మీనాక్షీ చేసిన ఈ పోస్టు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.
అయితే ఆమె పోస్ట్ పై నెటిజన్లు డిఫరెంట్ గా కామెంట్స్ పెడుతున్నారు.ఒకప్పటి హీరోయిన్ ని ఇప్పుడు ఎవరు గుర్తు పడతారు అంటూ కొంత మంది కామెంట్ చేయగా, ఇండియాలో మాత్రమే మీరు సెలబ్రిటీ అకక్డ కాదుగా అంటూ కౌంటర్స్ కూడా కొంత మంది వేశారు.