కొంతమంది పెళ్లి కాని నటినటులను పెళ్లి చేసుకునే వరకు ప్రశ్నలతో బాగా వేదిస్తూ ఉంటారు కొందరు జనాలు.వాళ్ళు ఎక్కడ కనిపిస్తే అక్కడ పెళ్లి ( Marriage )గురించి అడుగుతూనే ఉంటారు.
ఇటువంటివి మన బొద్దుగుమ్మ నిత్యమీనన్( Nithya Menon ) కు చాలానే ఎదురైయ్యాయి.కానీ ప్రతిసారి తనకు పెళ్లి ఇష్టం లేదు అన్నట్టుగానే స్పందిస్తూ వచ్చింది.
కానీ మొత్తానికి ఇప్పుడు పెళ్లి చేసుకోవడానికి సిద్ధమైంది.దానికి కారణం కూడా ఒకటి ఉందని తాజాగా బయటపడింది.
ఇంతకు అసలు విషయం ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
చూడ్డానికి బొద్దుగా ఉన్నప్పటికీ కూడా తెలుగు ప్రేక్షకులను అభిమానులుగా మార్చుకుంది నిత్య.మలయాళీ భాషకు చెందిన ఈమె మలయాళ భాషలోనే కాకుండా తెలుగు, ఇంగ్లీష్, కన్నడ భాషల్లో కూడా నటించింది.తొలిసారిగా 1998లో బాలనటిగా అడుగు పెట్టింది నిత్య.
ఆ తర్వాత 2010లో అలా మొదలైంది సినిమాతో( Ala Modalaindi Movie ) తెలుగు సినీ ఇండస్ట్రీకి హీరోయిన్ గా పరిచయం అయింది.ఈ సినిమాతోనే తెలుగు ప్రేక్షకుల హృదయాలను దోచుకుంది.
ఆ తర్వాత వరుసగా ఎన్నో అవకాశాలు అందుకోగా తనకు మళ్లీ మళ్లీ ఇది రాని రోజు, ఇష్క్, సన్నాఫ్ సత్యమూర్తి, జనతా గ్యారేజ్ వంటి సినిమాలు మంచి సక్సెస్ ను ఇచ్చాయి.కొన్ని సినిమాలలో అతిధి పాత్రలలో కూడా నటించింది.
మధ్యలో కొన్ని రోజులు సినిమాలకు బ్రేక్ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ మళ్లీ రిఎంట్రీ ఇచ్చింది.కానీ అప్పటిలా వరుస సినిమాలు కాకుండా గ్యాప్ లో మాత్రమే అవకాశాలు అందుకుంటుంది.
ఇక బుల్లితెరపై కూడా కొన్ని షోలలో జడ్జిగా చేసింది.నిత్యమీనన్ సింగర్ కూడా.
తన పాటలతో అందర్నీ బాగా ఫిదా చేస్తూ ఉంటుంది.నిత్యమీనన్ ఒకప్పుడు ఎలా ఉండేదో ఇప్పుడు కూడా అలాగే ఉంది.
ఇక సోషల్ మీడియాలో కూడా యాక్టివ్ గా కనిపిస్తూ తన సినిమాకి సంబంధించిన వీడియోలను, తన ఫోటోలను బాగా పంచుకుంటూ ఉంటుంది.కానీ ఎప్పుడూ కూడా అందాలు ఆరబోసినట్లు కనిపించదు.ఇక ఇదంతా పక్కన పెడితే నిత్యమీనన్ పెళ్లి చేసుకోకుండా ఒంటరిగా ఉంటున్న సంగతి తెలిసిందే.ఇక ఈమెకు పెళ్లి గురించి ఇప్పటికీ ఎన్నో ప్రశ్నలు ఎదురవుతూ వచ్చాయి.
నిజానికి తనకు పెళ్లి చేసుకోవడం అనేది అసలు ఇష్టం ఉండదు.కానీ ఇప్పుడు పెళ్లికి ఒప్పేసుకుంది.
ఆమెకు పెళ్లి వయసు వచ్చినప్పటి నుంచి తన తల్లిదండ్రులు తన పెళ్లి గురించి బాగా ఫోర్స్ చేస్తున్నారట.దీంతో తల్లిదండ్రులను సంతోష పెట్టడం కోసం పెళ్లి చేసుకోవడానికి నిర్ణయించుకుందట నిత్య.
ఇక తనను చేసుకోబోయేవాడు బడా వ్యాపారవేత్త( Businessman ) అని తెలిసింది.అంతేకాకుండా రెండు కుటుంబ సభ్యులు ఒక నిర్ణయానికి వచ్చి.
నిశ్చితార్థం డేట్ కూడా ఫిక్స్( engagement date is also fixed ) చేసుకుంటున్నారని జోరుగా వార్తలు వినిపిస్తున్నాయి.ఇందులో ఎంత నిజం ఉందో తెలియాలి అంటే కొన్ని రోజులు వేచి చూడాల్సిందే.