బోల్డ్ ప్రశ్నలతో చెత్త షో.. నిహారిక హోస్టింగ్ చేయడమే పెద్ద షాక్..?

తొలి రోజుల్లో ప్యూర్ తెలుగు కంటెంట్‌తో చాలా మందిని ఆకట్టుకున్న ఆహా ఓటీటీ ప్లాట్‌ఫామ్( Aha OTT Platform ) ఇప్పుడు పెడదారి పట్టినట్లు కనిపిస్తోంది.అడల్ట్ కంటెంట్ ఉంటే తప్ప ఓటీటీ ప్లాట్‌ఫామ్ నడిచే ఛాన్స్ లేనట్లు యాజమాన్యం భావిస్తుందో ఏమో తెలియదు కానీ ఇప్పుడు ఇందులో కొత్తగా వచ్చే ఏ వెబ్ సిరీస్, షో చూసినా అందులో అసహ్యం పుట్టించే బూతులు, అడల్ట్ సన్నివేశాలు ఉంటున్నాయి.

 Niharika Konidela Chef Mantra Bold Show,niharika Konidela, Chef Mantra, Episode-TeluguStop.com

ఈ స్ట్రీమింగ్ సర్వీస్‌ను విక్రయించనున్నారని వార్తలు వస్తున్న నేపథ్యంలోనూ ఇలాంటి చెత్త కంటెంట్ ఆహాలో పెరగడం ఆగడం లేదు.ఇందులో ప్రసారమయ్యే “చెఫ్ మంత్ర” కుకరీ షో( Chef Mantra Cookery Show ) కూడా బూతులతో నిండిపోయింది.

దీనిని మెగా డాటర్ నిహారిక హోస్టింగ్ చేస్తోంది.రీసెంట్‌ ఎపిసోడ్‌లో చాలా దారుణమైన ప్రశ్నలు ఇందులో అడిగారు.

దర్శకుడు ఎవరో కానీ ప్రోమో చూస్తేనే చాలా బోల్డ్‌గా కనిపించింది. నిహారిక( Niharika Konidela ) ఇప్పటికే డ్రగ్స్ కేసును ఎదుర్కోవడం, విడాకులు తీసుకోవడం వంటి వివాదాల్లో చిక్కుకొని బాగా సఫర్ అయ్యింది.

సినిమాల్లో క్లిక్ కూడా కాలేకపోయింది.ఇలాంటి పరిస్థితుల్లో ఆమె మరీ వెగటు కంటెంట్ జోలికి పోవడం చాలా మందిని షాక్‌కి గురిచేస్తుంది.


ప్రస్తుతం చెఫ్ మంత్ర మూడో సీజన్ నడుస్తోంది.ఈ షో మొదటి రెండు సీజన్లకు శ్రీముఖి, మంచు లక్ష్మి వరుసగా హోస్ట్ చేశారు.పేరుకి చెఫ్ మంత్ర కానీ ఇందులో వంటకు సంబంధించిన నైపుణ్యాలను పెద్దగా చూపించరు.సెలబ్రిటీ జంట( Celebrity Couple )ను తీసుకొచ్చి వారితో కలిసి వంటలు చేస్తుంటారు.

అలాగే సరదాగా మాటలు మాట్లాడుకుంటారు.నెక్స్ట్ ఎపిసోడ్‌లో రాహుల్ సిప్లిగంజ్, హేమచంద్ర గెస్టులుగా వచ్చినట్లు రీసెంట్ ప్రోమో చూస్తే అర్థమవుతుంది.

ఇందులో డైరెక్టర్ వాళ్లకు రాసిచ్చిన ప్రశ్నలు చాలా అసహ్యంగా ఉన్నాయి.మీరు ఒంటరిగా ఉన్నప్పుడు డ్యాష్ ఎవరితో చేయడానికి ఇష్టపడతారు.? అని రాహుల్‌ను, మీరు డ్యాష్ చేసేటప్పుడు ఏ జాగ్రత్తలు తీసుకుంటారు? అని హేమచంద్ర( Hema Chandra )ను ప్రశ్నించారు.డ్యాష్ అంటే ఇక “అదే” అని ప్రేక్షకులు భావించేలా వీరు ప్రశ్నలు అడిగారు.

ఈ ప్రశ్నలు వినగానే రాహుల్( Rahul Sipligunj ) చాలా ఇబ్బందికరంగా ముఖం పెట్టాడు.జవాబు ఎలా చెప్పాలిరా బాయ్ అంటూ తల పట్టుకున్నాడు.అలా అంటూనే రాహుల్ చేతి సైగలతో ఏదో నాకినట్లు చూపించాడు.ఇది చూసేందుకు బాగా అనిపించలేదు.నిహారిక ఇలాంటి షోలలో పాల్గొనడం మెగా ఫ్యామిలీ( Mega Family )కి నిజంగా సిగ్గుచేటు అని చెప్పుకోవచ్చు.నిజానికి ఆహాకి మంచి కంటెంట్ చేసే సత్తా ఉంది.

అన్‌స్టాపబుల్, కామెడీ సర్కస్, ఇండియన్ ఐడల్ ఆహా ఓటీటీ తెలుగు షోలు ప్రేక్షకులను ఎంత బాగా ఆకట్టుకున్నాయో ప్రత్యేకించి చెప్పాల్సిన పనిలేదు.అలాంటి వాటిని చేసుకుంటూ వెళ్ళక ఆహా వెగటు కంటెంట్‌ ప్రొడ్యూస్‌ చేయడానికి ఎక్కువ మొగ్గు చూపుతోంది.

రీసెంట్ గా మిక్సప్, డగ్ అవుట్ అనే రియాలిటీ షోలతో ఆహా మరింత దిగజారింది.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube