దేశ విదేశాల్లో భారతీయల హవా కొనసాగుతుంది.ఎక్కడ చూసినా భారతీయులు తమని తాము నిరూపించుకుంటున్నారు.
ఒకపక్క అగ్రరాజ్యం అమెరికా ఉపాధ్యక్ష పదవికి భారతీయ సంతతి మహిళ కమలా హారిస్ పోటీ పడుతుండగా ఇప్పుడు తాజాగా న్యూజిలాండ్ ప్రధాన మంత్రి జసిందా ఆర్డెర్న్ మంత్రి వర్గంలో భారతీయ మహిళకు చోటు దక్కడం గమనార్హం.న్యూజిలాండ్ ప్రధాన మంత్రి గా మరోసారి జసిందా ఆర్డెర్న్ విజయం అందుకోవడం తో ఆమె తాజాగా సోమవారం కొత్త మంత్రివర్గాన్ని ఆవిష్కరించారు.
ఈ నేపథ్యంలో కేరళ కు చెందిన 41 ఏళ్ల ప్రియాంక రాధాకృష్ణన్ కమ్యూనిటీ,వాలంటరీ సెక్టార్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు.దీనితో న్యూజిలాండ్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తోలి భారతీయ మహిళగా ఆమె రికార్డ్ సృష్టించారు.
కేరళ రాష్ట్రంలోని కొచ్చిలో పరవూర్ కు చెందిన ఆమె చెన్నై లో పుట్టి సింగపూర్ లో పెరిగారు.కొచ్చి లో ఆమె తాత వైద్య నిపుణులే కాకుండా కమ్యూనిస్టు కూడా.
చెన్నై లో పుట్టినప్పటికీ తల్లి దండ్రులు అయిన రామన్ రాధాకృష్ణన్, ఉషా దంపతుల కారణంగా ఆమె కుటుంబం చెన్నైలో స్థిరపడింది.ప్రియాంకా విద్యాభ్యాసం సింగపూర్, న్యూజీలాండ్‌లో కొనసాగగా, ఆ తర్వాత ఆమె… క్రైస్ట్‌చర్చ్‌కు చెందిన రిచర్డ్‌సన్ ను వివాహమాడింది.2004 నుండి లేబర్ పార్టీలో చురుకైన పాత్రను పోషించారు.
ఆక్లాండ్ నుంచి రెండు సార్లు ఎంపీ అయిన ఆమె 2017 లో తొలిసారిగా న్యూజిలాండ్ పార్లమెంటులో ప్రవేశించింది.
ఆ తరువాత వారసత్వ శాఖకు పార్లమెంటరీ ప్రైవేట్ కార్యదర్శిగా కూడా ఆమె సేవలు అందించారు.ప్రస్తుతం ఎంపిగా రెండోసారి ఎన్నికవ్వగా ఆమెకు తొలిసారిగా న్యూజిలాండ్ కేబినెట్ లో చోటు దక్కింది.