ప్రాచీన భారతదేశంలోని ప్రారంభ బౌద్ధ కళలను( Early Buddhist Art ) హైలైట్ చేసేలా 140కి పైగా కళాఖండాలతో న్యూయార్క్‌లోని ప్రఖ్యాత మెట్రోపాలిటన్ మ్యూజియం ఆఫ్ ఆర్ట్(మెట్)లో( Metropolitan Museum of Art ) ప్రదర్శను ఏర్పాటు చేశారు.ఇందులో క్రీస్తుపూర్వం 200 నుంచి క్రీస్తుపూర్వం 400 నాటి కళాఖండాలను ప్రదర్శించనున్నారు.
రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్, ది రాబర్ట్ హెచ్ఎన్ హో ఫ్యామిలీ ఫౌండేషన్ గ్లోబల్ అండ్ ఫ్రెడ్ ఐచానర్ ఫండ్‌లు సంయుక్తంగా ‘Tree Serpent: Early Buddhist Art in India, 200 BCE–400 CE’ పేరుతో ఈ ప్రదర్శనను నిర్వహిస్తున్నాయి.జూలై 21 నుంచి నవంబర్ 13 వరకు మెట్‌లో ఈ ప్రదర్శన జరుగుతుంది.
ఎగ్జిబిషన్ ప్రారంభోత్సవాన్ని పురస్కరించుకుని సోమవారం ఈ మ్యూజియంలో స్పెషల్ ప్రివ్యూ , రిసెప్షన్ జరిగింది.ఈ కార్యక్రమానికి అమెరికాలో భారత రాయబారి తరంజిత్ సింగ్ సంధు, భారత్‌లో అమెరికా రాయబారి ఎరిక్ గార్సెట్టి, రిలయన్స్ ఫౌండేషన్ వ్యవస్థాపకురాలు, చైర్‌పర్సన్ నీతా అంబానీ, న్యూయార్క్‌లోని భారత కాన్సులర్ జనరల్ రణధీర్ జైస్వాల్ , భారతీయ కమ్యూనిటీకి చెందిన ప్రముఖులు హాజరయ్యారు.

క్రీస్తుపూర్వం 200 నుంచి క్రీస్తుపూర్వం 400 నాటి 140కి పైగా కళాఖండాలు, భారతదేశంలో బౌద్ధానికి పూర్వం వున్న అలంకారిక శిల్పం, ఇంటర్‌లాకింగ్ థీమ్‌ల శ్రేణిని ఈ సందర్భంగా ప్రదర్శించనున్నారు.ఈ సందర్భంగా భారత్‌లో అమెరికా రాయబారి ఎరిక్ గార్సెట్టి( Eric Garcetti ) ఓ జాతీయ మీడియా సంస్థతో మాట్లాడుతూ.ఇలాంటివి భారత్ అమెరికా సంబంధాలను బలోపేతం చేస్తాయన్నారు.

అమెరికన్లు భారతదేశ చరిత్ర, ( Indian History ) ఆ దేశం మతపరమైన గతం గురించి తెలుసుకునేందుకు ఆసక్తి చూపుతున్నారని గార్సెట్టి పేర్కొన్నారు.భారత్, యూకే, యూరప్, అమెరికాలకు చెందిన డజను మంది సహాయంతో ఈ ప్రదర్శన ఏర్పాటు చేసినట్లు మెట్ తెలిపింది.ఇండో- రోమన్ మార్పిడికి సంబంధించిన వస్తువులు వాణిజ్యంలో ప్రాచీన భారతదేశ స్థానాన్ని వెల్లడిస్తాయని పేర్కొంది.
అంతకుముందు గతంలో భారతదేశం నుంచి దొంగిలించబడిన 105 పురాతన కళాఖండాలను అమెరికా( America ) ఇండియాకు అప్పగించింది.న్యూయార్క్‌లోని కాన్సులేట్ జనరల్ ఆఫ్ ఇండియా సమక్షంలో అప్పగింతల ప్రక్రియ పూర్తయ్యింది.