పెరుగుతున్న వ్యవస్ధీకృత నేరాలు .. భారత్‌ నుంచే కంట్రోలింగ్ అంటూ కెనడా పోలీసుల అనుమానాలు

కెనడా పోలీసులు( Canada ) ఇటీవలి కాలంలో వరుసగా చోటు చేసుకుంటున్న దోపిడీలు, సంబంధిత నేరాలను దర్యాప్తు చేస్తున్నారు.అల్బెర్టాలోని ఎడ్మోంటన్‌లో నేరస్తులు వుండే అవకాశం వుందని భావిస్తున్నారు.

 New Trend In Organised Crimes In Canada; Police Suspect India Link In Alberta Ex-TeluguStop.com

వారు ఈ ప్రాంతంలోని సంపన్నమైన దక్షిణాసియా ప్రజలను లక్ష్యంగా చేసుకుని నేరాలకు పాల్పడుతున్నారు.అగంతకులు వాట్సాప్ ద్వారా బాధితులకు సందేశం పంపి, డబ్బు డిమాండ్ చేస్తున్నారు.

బ్రిటీష్ కొలంబియా, అంటారియోలలో ఇలాంటి ఘటనలో నమోదయ్యాయి.అక్టోబర్ నుంచి జనవరి మధ్య కాలంలో ఈ తరహా 27 ఘటనలు చోటు చేసుకున్నట్లుగా నివేదికలు చెబుతున్నాయని ఎడ్మోంటన్ పోలీసులు తెలిపారు.

వీటిలో దోపిడీలు, దహనం, డ్రైవ్ బై షూటింగ్‌లు వున్నాయి.

Telugu Alberta, Canada, Canada Federal, Hardeepsingh, India, Justin Trudeau, Roy

భారత్‌లోని ఓ అనుమానితుడు అక్కడి నుంచి ఇక్కడి ముఠాల ద్వారా ఈ నేరాలకు పాల్పడినట్లుగా తాము భావిస్తున్నట్లు ఎడ్మోంటన్ పోలీస్ ఇన్స్‌పెక్టర్ లాన్స్ పార్కర్ విలేకరులతో అన్నారు.కాల్పులు, ఆయుధ నేరాలకు సంబంధించి ఇప్పటి వరకు ఆరుగురు యువకులను పోలీసులు అరెస్ట్ చేసినట్లు పార్కర్ చెప్పారు. కాల్పుల్లో ఎవరికీ ఎలాంటి గాయాలు జరగలేదు.అయితే దాదాపు 6.7 మిలియన్ డాలర్ల ఆస్తి నష్టం సంభవించినట్లుగా పోలీసులు వెల్లడించారు.ఈ ఘటనల వెనుక సదరు భారతీయుడితో వున్న లింక్‌పై మరిన్ని వివరాలు వెల్లడించానికి పోలీసులు నిరాకరించారు.కెనడా ఫెడరల్ పోలీసులు, రాయల్ కెనడియన్ మౌంటెడ్ పోలీసులు దర్యాప్తును పర్యవేక్షిస్తున్నారు.

Telugu Alberta, Canada, Canada Federal, Hardeepsingh, India, Justin Trudeau, Roy

కాగా.గతేడాది బ్రిటిష్ కొలంబియాలో జరిగిన సిక్కు వేర్పాటువాది హర్దీప్ సింగ్ నిజ్జర్( Hardeep Singh Nijjar ) హత్యకు భారతీయ ఏజెంట్లకు సంబంధం వుందంటూ కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో( Justin Trudeau ) చేసిన ఆరోపణలతో ఇరుదేశాల మధ్య దౌత్య సంబంధాలు దెబ్బతిన్నాయి.ఈ ఆరోపణలను భారత్ తోసిపుచ్చింది.కానీ నిజ్జర్ హత్యకు సంబంధించి కెనడా అధికారులు ఇప్పటి వరకు ఎవరిపైనా అభియోగాలు మోపలేదు.కెనడియన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రకారం.ఆ దేశ జనాభాలో దాదాపు 4 శాతం మంది భారతీయ వారసత్వానికి చెందినవారే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube