అమరావతి: అసెంబ్లీ బయట నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి నిరసన.తన నియోజకవర్గం లోని సమస్యల ప్ల కార్డుల ను ప్రదర్శిస్తూ అసెంబ్లీ కి పాదయాత్ర.కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే.నా అంతరాత్మ ప్రభోదానుసారo ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు వేస్తా.వైసీపీ ఇతర ఎమ్మెల్యేలు కూడా వారి వారి అంతరాత్మ ప్రభోదానుసారo ఓటు వేస్తారని భావిస్తున్నా.
సమస్యల పరిష్కారానికి నా నిరసన కొనసాగుతుంది.4 ఏళ్ళు సమస్యల పరిష్కారం కోసం తిరిగి తిరిగి విసిగిపోయే గళం వినిపిస్తున్నా.మైకు ఇచ్చే వరకూ అసెంబ్లీలో మైక్ అడుగుతూనే ఉంటా.
మైక్ ఇవ్వకుంటే నా నిరసన ప్లకార్డుల రూపేణా నిలబడి ప్రదర్శిస్తూనే ఉంటా.కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డికి పచ్చ కండువా కప్పి మద్దతు తెలిపిన రాజధాని రైతులు.