బిగ్ బాస్ సీజన్ 7 (Bigg Boss 7) కార్యక్రమం ఇప్పటికే ఆరువారాలను పూర్తిచేసుకుంది.ఇలా ఆరువారాలలో భాగంగా ఆరుగురు కంటెస్టెంట్ లో హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యారు.
ఈ విధంగా ఆరవ వారంలో భాగంగా మరొక లేడీ కంటెస్టెంట్ నయని పావని(Nayani Pavani)హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యారు.ఈమె ఐదవ వారంలో వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా హౌస్ లోకి అడుగుపెట్టారు.
ఇలా వైల్డ్ కార్డు ద్వారా హౌస్ లోకి అడుగుపెట్టినటువంటి ఒక వారానికే ఈమె హౌస్ నుంచి బయటకు రావడంతో ఒకసారిగా ఎమోషనల్ అయ్యారు.ఇలా హౌస్ లోకి వచ్చిన తర్వాత వారం రోజులకే ఈమె స్ట్రాంగ్ కంటెంట్ అనిపించుకున్నప్పటికీ ఎక్కువ కాలం పాటు హౌస్ లో కొనసాగ లేకపోయారు.

ఇలా ఈమె మొదటి వారమే అవసరం ఎలిమినేట్ కావడంతో బిగ్ బాస్ బజ్( Bigg Boss Buzzz ) కార్యక్రమంలో పాల్గొన్న సమయంలో తన ఎలిమినేషన్ గురించి మాట్లాడుతూ ఎమోషనల్ అయ్యారు.బిగ్ బాస్ బజ్ కార్యక్రమంలో భాగంగా గీతు రాయల్ (Geethu Royal) అడిగే ప్రశ్నలకు ఈమె ఆసక్తికరమైనటువంటి సమాధానాలు చెప్పారు.మీరు కావాలని టేస్టీ తేజతో( Tasty Teja ) గొడవపడాలని ఫిక్స్ అయ్యి గొడవ పడ్డారని అనిపిస్తుంది అంటూ ఈమె ప్రశ్నించారు.లాంటిది ఏమీ లేదు అంటూ నయని సమాధానం చెప్పారు.
ఇక మీరు కాకుండా ఈ వారం ఎవరు హౌస్ నుంచి బయటకు వెళ్తారని మీరు భావించారు అనడంతో నా బదులు ఈ వారం హౌస్ నుంచి అశ్విని(Aswini)బయటకు వస్తుందని తాను అనుకున్నాను.కానీ నేనే బయటకు వస్తానని అసలు ఊహించలేదు అంటూ ఈమె తెలిపారు.

హౌస్ లోకి వెళ్ళిన తర్వాత టాప్ ఫైవ్ కంటెస్టెంట్ గా నిలవాలన్న ధ్యేయంతోనే ఉన్న ఒక్క వారం కూడా హౌస్ లో అందరికీ గట్టి పోటీ ఇస్తూ టాస్కులలో ఆడాను.కానీ ఇలా ఎలిమినేట్ అవుతానని ఊహించలేదు అంటూ తెలియచేశారు.ఇలా బిగ్ బాస్ నుంచి బయటకు వెళ్లిన తర్వాత ఈమె తల్లి తనకు హారతి ఇచ్చి స్వాగతం పలికారు.అయితే ఆ సమయంలో తన తల్లిని హత్తుకొని సారీ అమ్మ మొదటి వారమే ఎలిమినేట్ అయ్యాను అంటూ బోరున ఏడ్చేసారని తెలుస్తుంది.
ప్రస్తుతం ఇందుకు సంబంధించినటువంటి వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.