కుక్క కి ఆకలేస్తే బిస్కట్స్ తినడమో,లేదంటే మరేదైనా ఆహరం తీసుకోవడమో వింటుంటాం.కానీ ఆకలేసింది అని ఒక కుక్క నోట్లు నమిలి మింగేసిన ఘటన యూకే లో చోటుచేసుకుంది.
వివరాల్లోకి వెళితే యూకే లోని నార్త్ వేల్స్ లో ఒక వ్యక్తి లాబ్రడూడిల్ రకానికి చెందిన ఓ కుక్కకు పెంచుకుంటున్నాడు.అయితే ఈ కుక్కకు ఆకలి ఏసింది కాబోలు ఏమి చెయ్యాలో అర్ధం కాక ఆ కుక్క ఆ వ్యక్తి కి డబ్బులతో కూడిన ఎన్వలెప్ కవర్ పార్సిల్ ఒకటి వచ్చింది.
దానికి దాదాపు 160 పౌండ్లు అంటే భారతీయ కరెంసీ ప్రకారం వాటి విలువ 14 వేల రూపాయలు అన్నమాట.అయితే ఆ పార్సిల్ రావడాన్ని గమనించిన ఆ కుక్క ఆ కవర్ ను పక్కకు తీసుకెళ్లి, నమిలి తినేసింది.
పాపం ఆకలి తో అది ఏమి తింటుందో కూడా దానికి అర్ధం కాలేదో ఏమో.దీనితో వెంటనే విషయం తెలుసుకున్న ఓనరు నెత్తి నోరు బాదుకున్నాడు.కానీ ఎలాంటి ప్రయోజనం లేకపోయింది.అయితే ఆ కుక్క మీద ఉన్న ప్రేమ తో దానికి ఎలాంటి ప్రమాదం కలగకూడదు అన్న ఉద్దేశ్యంలో పశు వైద్యుడి వద్దకు పరుగులు తీశాడు.
దీనితో వైద్యుడు నానా తిప్పలు పడి ఆ కుక్క తిన్న పౌండ్ల ను మొత్తానికి బయటకి తీశాడు.కానీ ఆ చెత్త అంతా తీసినందుకు 11 వేలు బిల్లు వేశాడు.

దీనితో ఓనరు మరోసారి షాక్ తిన్నాడు.అయితే ఈ ఘటన కు సంబందించిన ఫోటో ఒకటి ఇప్పుడు సోషల్ మీడియాలోహల్ చల్ చేస్తుండగా ఇప్పుడు ఇది వైరల్ గా మారింది.పాపం ఓనరు కి వచ్చిన 14 వేలు పోవడమే కాకూండా అదనంగా 11 వేలు వైద్యుడి బిల్లు కూడా అదరడం తో అతడు తలపట్టుకుని కూర్చున్నాడు.పిల్లలు అల్లరి చేస్తే కనీసం ఒక్క దెబ్బ అయినా వేస్తాం,కానీ నోరు లేని ప్రాణుల ను ఏమి చేయలేము కదా.ఎందుకంటే వాటి మీద ఉండే ప్రేమ అలాంటిది మరియు వాటికి మంచి చెడు తెలియవు కాబట్టి.పాపం ఈ ప్రేమ తోనే ఆ కుక్క ఓనరు దానిని ఆసుపత్రికి తీసుకెళ్లి మరో 11 వేల రూపాయలు వదిలించుకున్నాడు.