ఎన్టీఆర్ జిల్లా నందిగామ కంచికార్లలో దళిత యువకుడు శ్యామ్ కుమార్ పై సభ్య సమాజం తలదించుకొనేలా దాడి జరగడం తెలిసిందే.ఈ ఘటన రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించింది.కాగా ఈ ఘటనపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ట్విట్టర్ లో స్పందించారు.“రాష్ట్రంలో దళిత సోదరీ సోదరీమణులపై దాడులు వైసీపీ ప్రభుత్వం యొక్క అత్యంత అవమానకరమైన లక్షణాలలో ఒకటి.కంచికార్ల అంబేద్కర్ కాలనీకి చెందిన కాంట్రి శ్యామ్ కుమార్ నీ అపహరించి చిత్రహింసలు పెట్టిన విధానం నన్నెంతగానో భయాందోళనకు గురిచేసింది.అతనిపై దాడికి పాల్పడిన వాళ్లు నీచాతి నిచానికి చేరుకున్నారు.
ఆ యువకుడు నీళ్ళు అడిగితే మూత్ర విసర్జన చేసి అగౌరపరిచారు.ఇది చాలా అత్యంత హేయమైన ఘటన.కుల వివక్ష.అమానవీయ ప్రవర్తన వంటి వాటికి సమాజంలో చోటు లేదు.
ఈ క్రమంలో బాధితుడికి సంఘీభావం తెలుపుతూ న్యాయం చేయాలని కోరుతున్నామంటూ” లోకేష్ ట్వీట్ చేశారు.ఇదే క్రమంలో తెలుగుదేశం పార్టీకి చెందిన వాళ్లు దాడికి గురైన దళిత యువకుడు శ్యామ్ కుమార్ ని హాస్పిటల్ లో పరామర్శించడం జరిగింది.
ఈ దాడికి పాల్పడిన నిందితులపై నాన్ బెయిలబుల్ కేసులు నమోదు చేయాలని కోరుతున్నారు.వైసీపీ అధికారంలోకి వచ్చాక దళితులపై దాడులు పెరిగిపోతున్నాయని టీడీపీ నాయకులు వ్యాఖ్యానించడం జరిగింది.