బాలయ్య కూతురి పొలిటికల్ ఎంట్రీ ఫిక్స్.. ఆ నియోజకవర్గంలో పోటీ చేసి గెలుస్తారా?

నందమూరి కుటుంబానికి సంబంధించి ఏ వార్త వచ్చినా ఆ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.నందమూరి బాలయ్య( Nandamuri Balakrishna ) ప్రస్తుతం హిందూపురం నియోజకవర్గానికి ఎమ్మెల్యేగా ప్రాతినిథ్యం వహిస్తున్నారు.2024 ఎన్నికల్లో బాలయ్య ఇదే నియోజకవర్గం నుంచి పోటీ చేస్తే ఎమ్మెల్యేగా హ్యాట్రిక్ సాధిస్తారని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.అయితే బాలయ్య కూతురు నారా బ్రాహ్మణి రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వనున్నారని టాక్ వినిపిస్తోంది.

 Nara Brahmani Political Entry Details Here Goes Viral In Social Media , Nara Bra-TeluguStop.com

టీడీపీ వర్గాల్లో ప్రస్తుతం బ్రాహ్మణి పొలిటికల్ ఎంట్రీ గురించి చర్చలు జరుగుతున్నాయని సమాచారం అందుతోంది.తెలుగుదేశం పార్టీకి కంచుకోట అయిన హిందూపురం నుంచి బ్రాహ్మణి పోటీ చేయనున్నారని భోగట్టా.

అయితే బ్రాహ్మణి హిందూపురం నుంచి పోటీ చేస్తే మాత్రం బాలయ్య పొలిటికల్ జర్నీ ఏ విధంగా ఉండనుందనే ప్రశ్న వినిపిస్తోంది.బాలయ్య మరో నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారా? లేక రాజకీయాలకు దూరమవుతారా? అనే ప్రశ్న వ్యక్తమవుతోంది.

గతంలోనే విజయవాడ( Vijayawada ) ఎంపీ సీటు నుంచి బ్రాహ్మణి పోటీ చేస్తారని ప్రచారం జరిగినా ఆ ప్రచారం నిజం కాలేదు.అయితే హిందూపురం నుంచి బ్రాహ్మణి నిజంగా పోటీ చేస్తారో లేదో తెలియాలంటే మాత్రం మరికొన్ని రోజులు ఆగాల్సిందే.2024 ఎన్నికల్లో వైసీపీ నుంచి దీపిక పోటీ చేస్తున్న నేపథ్యంలో ఆమెకు ప్రత్యర్థిగా బ్రాహ్మణిని రంగంలోకి దింపాలని టీడీపీ భావిస్తున్నట్టు సమాచారం.

నారా బ్రాహ్మణి( Nara brahmani ) ఇప్పటికే పలు రంగాలలో ప్రూవ్ చేసుకోగా రాజకీయాలలో కూడా ఆమె సత్తా చాటుతారేమో చూడాలి.బాలయ్య ఫ్యాన్స్ మాత్రం బాలయ్యనే హిందూపురం నుంచి పోటీ చేయాలని కోరుకుంటున్నారు.2024 ఎన్నికల్లో కచ్చితంగా అధికారంలోకి రావాలని టీడీపీ భావిస్తుండగా ఏపీ ఎన్నికల ఫలితాలు ఏ విధంగా ఉండనున్నాయో తెలియాల్సి ఉంది.ఏపీలో టీడీపీ, జనసేన పొత్తు కచ్చితంగా ఉంటుందని పొలిటికల్ వర్గాల్లో వినిపిస్తుండటం గమనార్హం.

Balakrishna Daughter Brahmani Politicial Entry

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube