టాలీవుడ్ ఇండస్ట్రీలో దర్శకునిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకున్న వాళ్లలో బి.గోపాల్( B Gopal ) ఒకరు.అగ్ర హీరోలతో బి.గోపాల్ తెరకెక్కించిన సినిమాలలో మెజారిటీ సినిమాలు సక్సెస్ సాధించాయి.ప్రస్తుతం ఈ స్టార్ డైరెక్టర్ డైరెక్షన్ కు దూరంగా ఉన్నారనే సంగతి తెలిసిందే.ప్రతిధ్వని సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలో బి.గోపాల్ కెరీర్ మొదలైంది.ఈ ప్రముఖ దర్శకుడు నటుడు వేణు తొట్టంపూడికి మామ కావడం గమనార్హం.
ప్రతిధ్వని సినిమాకు( Pratidhvani Movie ) నంది అవార్డ్ అందుకున్న బి.గోపాల్ తర్వాత రోజుల్లో ఎన్నో అవార్డ్ లను సొంతం చేసుకున్నారు.అయితే ఈ డైరెక్టర్ డైరెక్షన్ లో తెరకెక్కిన సినిమాలలో ఇండస్ట్రీ హిట్లు ఎక్కువగా ఉన్నాయి.మూడున్నరేళ్లలో ఈ డైరెక్టర్ డైరెక్షన్ లో తెరకెక్కిన మూడు సినిమాలు ఇండస్ట్రీ హిట్లుగా నిలిచాయి.
ఈ సినిమాలు వరుసగా ఇండస్ట్రీ హిట్లు కాకపోయినా మూడున్నరేళ్లలో మూడు ఇండస్ట్రీ హిట్లు అంటే సాధారణ విషయం కాదు.

బాలయ్య బి.గోపాల్ కాంబినేషన్ లో తెరకెక్కిన సమరసింహారెడ్డి సినిమా( Samarasimha Reddy ) 1999లో విడుదలైన ఇండస్ట్రీ హిట్ గా నిలవడం గమనార్హం.ఇదే కాంబినేషన్ లో తెరకెక్కిన నరసింహ నాయుడు సినిమా( Narasimha Naidu ) 2001 సంక్రాంతి కానుకగా విడుదలై ఇండస్ట్రీ హిట్ గా నిలవదం గమనార్హం.
చిరంజీవి బి.గోపాల్ కాంబినేషన్ లో ఇంద్ర సినిమా( Indra Movie ) తెరకెక్కి 2002 జులై నెలలో విడుదలై ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది.

మెగా అభిమానులను ఈ సినిమా ఎంతగానో మెప్పించింది. బి.గోపాల్ తరహా డైరెక్టర్లు టాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంతో అవసరమని చెప్పవచ్చు.ఈ డైరెక్టర్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఆరడుగుల బుల్లెట్ సినిమా 2021 సంవత్సరంలో విడుదలై డిజాస్టర్ గా నిలిచింది.
ఈ సినిమా తర్వాత బి.గోపాల్ డైరెక్షన్ లో మరో సినిమా రాలేదు.ఈ నెల 24వ తేదీన బి.గోపాల్ పుట్టినరోజు( B Gopal Birthday ) కాగా ఈ దర్శకుడు మరెన్నో పుట్టినరోజులు జరుపుకోవాలని అభిమానులు కోరుకుంటున్నారు.







