విడుదల రోజే ఓటీటీ లోకి నాని 'హాయ్ నాన్న' చిత్రం..షాక్ లో ఫ్యాన్స్!

విభిన్నమైన కథాంశాలతో ఫ్యాన్స్ మరియు ఆడియన్స్ కి సరికొత్త థ్రిల్లింగ్ అనుభూతిని ఇవ్వాలని తాపత్రయం పడే హీరోలలో ఒకడు న్యాచురల్ స్టార్ నాని( Nani ).ఈయన ఫిల్మోగ్రఫీ మొత్తం ఒకసారి చూస్తే ఈ విషయం అర్థం అవుతుంది.

 Nani's 'hi Nanna' Movie In Ott On The Day Of Release Fans In Shock , Nani , Hi N-TeluguStop.com

ప్రతీ సినిమా ఎంతో ప్రత్యేకంగా ఉంటుంది.ఈ ఏడాది ప్రారంభం లో ‘దసరా’ సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చి అద్భుతమైన ఘన విజయం ని సొంతం చేసుకున్న నాని, ఏకంగా వంద కోట్ల రూపాయిల క్లబ్ లోకి చేరిపోయాడు.

అంత పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ తర్వాత నాని చేసిన చిత్రం ‘హాయ్ నాన్న’( hi nanna ).విడుదలకు ముందే ప్రమోషనల్ కంటెంట్ తో ఫ్యాన్స్ మరియు ఆడియన్స్ ని విశేషం గా ఆకట్టుకున్న ఈ చిత్రం.విడుదల తర్వాత అదే రేంజ్ కూడా అదే రేంజ్ రెస్పాన్స్ ని దక్కించుకుంది.మొదటి ఆట నుండే సూపర్ పాజిటివ్ రెస్పాన్స్ ని దక్కించుకున్న ఈ చిత్రం బాక్స్ ఆఫీస్ రేంజ్ ఎక్కడి దాకా వెళ్తుందో చూడాలి.

Telugu Nanna, Mrunal Thakur, Nani, Nanisnanna, Netflix, Tollywood-Movie

ఇదంతా పక్కన పెడితే ఈ సినిమాకి సంబంధించిన ఓటీటీ స్ట్రీమింగ్ ( OTT streaming )డీటెయిల్స్ ఇప్పుడు సోషల్ మీడియా లో తెగ హాట్ టాపిక్ గా మారింది.విడుదల రోజే ఓటీటీ స్ట్రీమింగ్ వివరాలు ఎలా బయటకి వచ్చాయి అని మూవీ టీం జుట్టు పీక్కుంటున్నారు.ఈ సినిమాకి సంబంధించిన ఓటీటీ రైట్స్ అన్నీ భాషలకు కలిపి నెట్ ఫ్లిక్స్ సంస్థ( Netflix ) భారీ రేట్ కి కొనుగోలు చేసిందట.సినిమాకి రెండు మూడు వారాలు థియేట్రికల్ రన్ వస్తే జనవరి నెలాఖరులో కానీ, లేదా వీకెండ్ వరకు మంచి వసూళ్లను రాబట్టి, ఆ తర్వాత థియేట్రికల్ రన్ రాకపోతే న్యూ ఇయర్ రోజున కానీ స్ట్రీమింగ్ చేసేందుకు ఒప్పందం కుదిరింది అట.అంటే ఈ సినిమా ఓటీటీ లో న్యూ ఇయర్ రోజు టెలికాస్ట్ అవుతుందా, లేకపోతే జనవరి నెలాఖరున టెలికాస్ట్ అవుతుందా అనేది సినిమా బాక్స్ ఆఫీస్ రన్ మీద ఆధారపడి ఉంటుంది.

Telugu Nanna, Mrunal Thakur, Nani, Nanisnanna, Netflix, Tollywood-Movie

ఇదంతా పక్కన పెడితే ఈ సినిమాని మిడ్ వీక్ లో విడుదల చెయ్యడం పెద్ద పొరపాటు అని ట్రేడ్ పండితులు అంటున్నారు.క్లాస్ సినిమాలకు పెద్ద గా హైప్ లేకపోతే ఓపెనింగ్స్ రావడం చాలా కష్టం.‘హాయ్ నాన్న’ విషయం లో అదే జరిగింది.ఈ సినిమాకి మొదటి రోజు కేవలం నాలుగు కోట్ల రూపాయిల షేర్ వసూళ్లు మాత్రమే వచ్చే అవకాశం ఉందట.‘దసరా’ తో మొదటి రోజు 12 కోట్ల రూపాయిల షేర్ ని కొల్లగొట్టిన నాని రేంజ్ కి ఇది చాలా తక్కువ అనే చెప్పాలి.చూడాలి మరి ఫుల్ రన్ లో ఈ సినిమా ఎంత వరకు వసూలు చేస్తుంది అనేది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube