తెలంగాణ యాసలో చింపేస్తానంటోన్న నాని

నేచురల్ స్టార్ నాని ప్రస్తుతం వరుసబెట్టి సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు.ఇప్పటికే ఇంద్రగంటి మోహన్‌కృష్ణ డైరెక్షన్‌లో తెరకెక్కుతున్న ‘వి’ చిత్రంలో నాని విలన్ పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే.

 Nani To Try Telangana Accent For His Next, Nani, Telangana Accent, Sudhakar Cher-TeluguStop.com

ఈ సినిమాతో మరోసారి తనదైన మార్క్ వేసేందుకు రెడీ అవుతున్నాడు.ఇక ఈ సినిమా తరువాత తన నెక్ట్స్ మూవీని శివ నిర్వాణ డైరెక్షన్‌లో టక్ జగదీష్ చిత్రంలో నటిస్తున్నాడు.

ఈ సినిమా తరువాత కూడా నాని తనదైన సినిమాల సెలెక్షన్‌లతో దూసుకెళ్లేందుకు రెడీ అవుతున్నాడు.

అయితే ఈసారి తెలంగాణ యాసతో నాని తుక్కురేగొట్టేందుకు రెడీ అవుతున్నాడు.

నాని ఇప్పటికే కృష్ణార్జున యుద్ధం చిత్రంలో రాయలసీమ యాసలో ప్రేక్షకులను అలరించిన సంగతి తెలిసిందే.ఇప్పుడు టక్ జగదీష్ చిత్రంలో గోదావరి బుల్లోడిగా నాని గోదావరి యాసలో మాట్లాడి ప్రేక్షకులను అలరించేందుకు రెడీ అవుతున్నాడు.

అయితే తన నెక్ట్స్ చిత్రంలో తెలంగాణ యాసలో మాట్లాడి ప్రేక్షకులను మెస్మరైజ్ చేసేందుకు నాని రెడీ అవుతున్నాడు.

‘పడి పడి లేచే మనసు’ వంటి చిత్రాన్ని ప్రొడ్యూస్ చేసిన సుధాకర్ చెరుకూరి నిర్మాణంలో తెరకెక్కబోయే సినిమాలో నాని నటించనున్నాడు.

ఈ సినిమాలో నాని ఫుల్టూ తెలంగాణ అబ్బాయిగా నటిస్తాడని తెలుస్తోంది.ఈ సినిమాను వచ్చే ఏడాదిలో ప్రారంభించేందుకు రెడీ అవుతున్నారు చిత్ర యూనిట్.మరి రాయలసీమ యాసలో మెప్పించి, గోదావరి యాసతో రెడీ అయిన నాని తెలంగాణ యాసలో ఎలా ఉండబోతున్నాడో చూడాలంటే మరో ఏడాది ఆగాల్సిందే.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube