నాని హీరోగా వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో రూపొందుతున్న అంటే సుందరానికి అనే సినిమా అన్ని వర్గాల వారిని ఆకట్టుకునేలా ఎంటర్ టైన్ మెంట్ ను అందించడం ఖాం అన్నట్లుగా టైటిల్ మరియు మోషన్ పోస్టర్ చూస్తూనే అనిపిస్తుంది.కనుక సినిమా కోసం ప్రేక్షకులు ఇప్పటి నుండే ఎదురు చూస్తున్నారు.
నాని ఏ పాత్రలో అయినా జీవించేస్తాడు.ఖచ్చితంగా ఈ సినిమాలో కూడా కుమ్మేస్తాడని ప్రతి ఒక్కరు నమ్మకంగా ఎదురు చూస్తున్నారు.
షూటింగ్ ప్రారంభం అవ్వబోతున్న సమయంలో సినిమాకు అనూహ్యంగా బ్రేక్ పండింది.దర్శకుడు వివేక్ ఆత్రేయ తమ బ్యానర్ లో సినిమా చేయాల్సి ఉండగా మరో బ్యానర్ కు వెళ్లాడు అంటూ నిర్మాత రాజ్ కందుకూరి నిర్మాతల మండలిలో ఫిర్యాదు చేశాడు.
వివేక్ ఆత్రేయ మొదటి సినిమా రాజ్ కందుకూరి బ్యానర్ లో చేశాడు.రెండవ సినిమా కూడా ఆయన బ్యానర్ లో చేయాల్సి ఉండగా మరో బ్యానర్ లో చేయాల్సి వచ్చింది.
సరే మూడవ సినిమా అయినా ఖచ్చితంగా రాజ్ కందుకూరి బ్యానర్ లో చేస్తానంటూ దర్శకుడు వివేక్ అగ్రిమెంట్ ఇచ్చాడు.కాని అది కూడా తప్పాడు అంటూ నిర్మాత రాజ్ ఆరోపిస్తున్నాడు.

తన బ్యానర్ లో చేయాల్సిన సినిమాను మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ లో చేయిస్తున్నారు అంటూ ఆయన దర్శకుడు మరియు నిర్మాణ సంస్థపై ఆరోపణలు చేశాడు.దాంతో ఈ సినిమా ఆగిపోవాల్సిందేనా లేదంటే రాజీకి వచ్చి సినిమాను ఏమైనా సైడ్ ఇచ్చేనా చూడాలి.వీరిద్దరు కూడా రాజీ పడకుంటే మాత్రం ఖచ్చితంగా సినిమా ఆగిపోయే ప్రమాదం ఉంది.మైత్రి మూవీ మేకర్స్ వారు ఈ సినిమా నిర్మాణంలో భాగస్వామ్యం అయినా ఇవ్వాలి లేదంటే దర్శకుడు నష్టపరిహారం అయినా చెల్లించాల్సి ఉంటుంది.
ఈ రెంటిలో దేనికి రాజ్ కందుకూరి ఓకే అంటాడో చూడాలి.నిర్మాతల మండలిలో నిర్మాత రాజ్ కందుకూరికి అనుకూలంగా తీర్పు వచ్చే అవకాశం ఉంది.ఎందుకంటే ఇద్దరి మద్య ఒప్పందం చాలా క్లీయర్ గా ఉంది.కనుక నిర్మాత ను దర్శకుడు వివేక్ ఆత్రేయ మోసం చేసినట్లే అంటూ నిర్మాతల మండలి అభిప్రాయం వ్యక్తం చేసే అవకాశాలు ఉన్నాయంటూ మీడియా వర్గాల్లో టాక్ వినిపిస్తుంది.