యువ హీరో నాగ శౌర్య( Naga Shaurya ) రీసెంట్ మూవీ రంగబలి కూడా బాక్సాఫీస్ దగ్గర ఫెయిల్ అయ్యింది.డిఫరెంట్ కథతో దసరా తర్వాత సుధాకర్ చెరుకూరి ఎంతో నమ్మకంగా నిర్మించిన ఈ సినిమా నిరాశపరచింది.
నాగ శౌర్యకి వరుస ఫ్లాపులు చాలా కామన్ అయ్యాయి.ఛలో తర్వాత అతను హిట్ అందుకున్న సినిమా ఏది లేదు.
అయితే ప్రయత్నాలు చేయడంలో మాత్రం నాగ శౌర్య వెనక్కి తగ్గట్లేదు.ఫలితాలతో సంబంధం లేకుండా వరుస ప్రాజెక్ట్ లు చేస్తున్నాడు.
అసలైతే రంగబలి( Rangabali ) మీద భారీగా హోప్స్ పెట్టుకోగా సినిమా మాత్రం నిరాశపరచింది.
అయితే నాగ శౌర్య ఇప్పటికే మాస్, క్లాస్, కామెడీ ఇలా అన్ని ట్రై చేశాడు.మరి ఎక్కడ తేడా కొడుతుందో ఏమో కానీ నాగ శౌర్య సినిమాల రిజల్ట్ లు అతని కెరీర్ ని డైలమాలో పడేలా చేస్తున్నాయి.నాగ శౌర్య ఇంకేం చేస్తే బెటర్ అన్న ఆలోచన వస్తుంది.
అయితే సినిమాలు ఎంటర్టైన్ మెంట్ తో చేస్తున్నా సంథింగ్ ఏదో మిస్ అవుతున్న కారణంగా అతని సినిమాలు ఫ్లాప్ అవుతున్నాయి.మరి ఇక మీదట నాగ శౌర్య ఆ తప్పులు కూడా జరగకుండా సినిమాలు చేస్తే బెటర్ అని చెప్పొచ్చు.