తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు జబర్దస్త్ కామెడీ షో గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.ప్రతి గురు శుక్ర వారాలలో రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలను కడుపుబ్బా నవ్విస్తున్న షో జబర్దస్త్.
ఈ షో ద్వారా ఎంతోమంది కమెడియన్ లు ఇండస్ట్రీకి పరిచయం అవ్వడమే కాకుండా విపరీతమైన పాపులారిటీ తో దూసుకుపోతున్న విషయం కూడా తెలిసిందే.చాలామంది ఈ జబర్దస్త్ ద్వారా ఎంతో పాపులారిటీ, క్రేజ్ తెచ్చుకొని సినిమాలలో అవకాశాలు సంపాదించుకుంటూ దూసుకుపోతున్నారు.
ఈ జబర్దస్త్ షో కి నాగబాబు జడ్జిగా వ్యవహరిస్తున్నప్పుడు ఈ షో కి ఎలాంటి ఆదరణ లభించిందో నాగబాబు లో నుంచి దూరం అయిన తర్వాత ఆ ఆదరణ కాస్త తగ్గింది అని చెప్పవచ్చు.
నాగబాబు ఎక్కడ ఉన్నా జబర్దస్త్ కమెడియన్ లకు అలాగే నాగబాబు కు మధ్య బంధం విడదీయలేనిది అని చెప్పవచ్చు.
ఇక నాగబాబు కుటుంబ పెద్దగా గైడ్ చేస్తూ వస్తున్నారు అంటూ గతంలో సుధీర్ గెటప్ శీను లాంటివాళ్ళు తెలిపిన విషయం తెలిసిందే.నాగబాబు వెళ్లిపోయిన తర్వాత కమెడియన్లు జబర్దస్త్ షో ని కంటిన్యూ చేస్తూనే ఎవరి దారి వారు చూసుకుని వెళ్లిపోయారు.
అలా జబర్దస్త్ నుంచి వెళ్లిపోయిన వారిలో ముక్కు అవినాష్ కూడా ఒకరు.జబర్దస్త్ షో ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్న ముక్కు అవినాష్ తాజాగా తనకు నాగబాబుతో ఉన్న అనుబంధాన్ని గురించి చెప్పుకొచ్చారు.
ముక్కు అవినాష్ ఇటీవలే పెళ్లి చేసుకొని ఒక ఇంటివాడైన విషయం తెలిసిందే.
ప్రస్తుతం జబర్దస్త్ షో కి దూరంగా ఉంటున్న ముక్కు అవినాష్ కామెడీ స్టార్ ధమాకా షోలో చేస్తున్న విషయం తెలిసిందే.
తాజాగా జబర్దస్త్ ని వదిలేయడానికి అసలు కారణాలు చెబుతూ నాగబాబు గురించి పలు వ్యాఖ్యలు చేశాడు.అవినాష్ మాట్లాడుతూ.
ఎవరి పరిస్థితులని బట్టి వారు నిర్ణయం తీసుకుంటూ ఉంటారు.ఇప్పుడు నేను ఇండస్ట్రీకి రావడానికి కారణం నాగబాబు గారు కాదు కదా.ఇది కూడా అంతే.అలాగే పరిస్థితుల వల్ల నాగబాబు సార్ జబర్దస్త్ ని వదిలేయడం జరిగింది.
అలాగే మేము కూడా.
నాగబాబు గారు ఎప్పుడూ మాకు తండ్రి స్థానంలో టూ.ఎటువంటి పాయింట్ ఎంచుకుంటే బావుంటుందో గైడెన్స్ ఇచ్చేవారు.ఏదైనా తప్పు చేస్తే.
నా కొడకా ఇంకోసారి రిపీట్ అయిందో.అంటూ ఒక తండ్రిలాగా మమ్మల్ని తిట్టేవారు.
అలా ఆయన భయంతోనే మేము స్కిట్స్ బెటర్ గా చేసేవాళ్ళం అని తెలిపాడు అవినాష్.అలాగే జబర్దస్త్ షోలో ఉన్నప్పుడు తప్పులు చేస్తే.
పక్కన రూమ్ కి పిలిచి మరీ మందలింస్తు బాగా చేయండి అంటూ బెటర్ సలహాలు ఇచ్చేవారని, అంతేకాని ఎప్పుడు మా నిర్ణయాల విషయంలో ఆయన జోక్యామ్ చేసుకోరు.మేము జబర్దస్త్ ని విడిచిపెట్టడానికి, ఇప్పుడు మేము చేస్తున్న షోలకు నాగబాబు గారు కారణం కాదు అని చెప్పుకొచ్చాడు ముక్కు అవినాష్.