MS ధోని (మహేంద్ర సింగ్ ధోనీ) అంటే ఎవరో తెలియని భారతీయులు ఉండనే వుండరు.తనదైన ఆటతీరుతో దేశంలోనే కాకుండా యావత్ ప్రపంచమంతటా అభిమానులను సంపాదించుకున్న క్రికెట్ క్రీడాకారుడు ధోని.
ఇతను 1981 జూలై 7 ఒక భారతీయ క్రికెట్ క్రీడాకారుడిగా గ్రీజులోకి అడుగుపెట్టాడు.అనతికాలంలోనే భారత జాతీయ క్రికెట్ జట్టు సారథిగా ఎదిగాడు.
ఈ క్రమంలో అనేక విజయాలు చేకూర్చాడు.అటాకింగ్ కుడి చేతివాటం గల మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్, వికెట్ -కీపర్ గా కీర్తి గడించాడు.2007 లో రాహుల్ ద్రావిడ్ నుండి వన్డే కెప్టెన్సీ బాధ్యతలు స్వీకరించాడు.
సారధిగా బాధ్యతలు స్వీకరించడంతోనే మొట్ట మొదటి ద్వైపాక్షిక వన్డే సిరీస్ లోనే జట్టుకు శ్రీలంక, న్యూజిలాండ్ తో పోటాపోటిగా పొరాడి విజయం తీసుకవచ్చాడు.
తన సారథ్యంలో భారతదేశం 2007 ICC ప్రపంచ ట్వంటీ ట్వంటీ, 2007-08 C.B సిరీస్, 2010 ఆసియా కప్, 2011 ఐసీసీ క్రికెట్ వరల్డ్ కప్, 2013 ICC చాంపియన్స్ ట్రోఫీ గెలుచుకున్నాము.ఇకపోతే MS ధోని.IPS ఆఫీసర్ జి.సంపత్ కుమార్‌పై మద్రాస్ హైకోర్టులో క్రిమినల్ ధిక్కార పిటిషన్ దాఖలు చేయడం ఇపుడు సంచలనం రేపుతోంది.
క్రికెట్ బెట్టింగ్, పలు మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలకు సంబంధించి హైకోర్టుకు సమర్పించిన లిఖితపూర్వక అఫిడవిట్‌లో ధోనీ, IPS అధికారి సంపత్ కుమార్ పరువు నష్టం కలిగించే ప్రకటనలు చేశారని ఇందులో ఆరోపించాడు.ధోని పిటిషన్ ప్రకారం.2014లో హైకోర్టులో సంపత్ కుమార్ దావా వేశారని.గతంలో ఆయన చేసిన ఆరోపణలు తన పరువుకి భంగం కలిగించే విధంగా ఉన్నట్లు తెలిపారు.అందుకే IPS సంపత్ కుమార్ సహా పలువురు అధికారులపై క్రిమినల్ ధిక్కార పిటిషన్ దాఖలు చేసినట్లు ధోని వివరణ ఇచ్చారు.