ప్రాణాపాయం నుంచి రెప్పపాటులో కొడుకుని కాపాడిన తల్లి.. వీడియో వైరల్..

కొంతమంది రాష్ డ్రైవింగ్( Rash driving ) చేయడం వల్ల ఏ పాపం చేయని ప్రజలు బలైపోతున్నారు.పీకల దాకా మద్యం పుచ్చుకోవడం, ఆపై స్టీరింగ్ ముందు కూర్చుని మత్తులోనే డ్రైవ్ చేయడం చాలా మందికి అలవాటైపోయింది.

 Mother Who Saved Her Son From Danger In The Blink Of An Eye Video Viral, Viral-TeluguStop.com

కొంతమందికి డ్రైవింగ్ సరిగా రాకపోయినా పబ్లిక్ ప్లేసులలో డ్రైవింగ్ చేస్తున్నారు.వీరి నిర్లక్ష్యం ఎంతోమంది నిండు ప్రాణాలను తీసేసి కన్నవారికి, కన్న పిల్లలకు తీవ్రమైన శోకం మిగుల్చుతోంది.

తాజాగా ఒక కారు డ్రైవర్( Driver ) కూడా వెనక వైపు చూసుకోకుండా చాలా ఫాస్ట్‌గా రివర్స్ చేశాడు.దాని వెనుక ఇద్దరు పిల్లలతో కలిసి ఓ తల్లి వెళ్తోంది.కారు చాలా వేగంగా రివర్స్ కావడం తల్లి వెంటనే గమనించింది.తన బాలుడిని ఢీకొట్టడం కూడా గ్రహించి మిల్లీ సెకన్లలోనే అప్రమత్తమయ్యింది.తన పిల్లోడిని చేయి పట్టుకొని కారు కింద పడకుండా తన వైపు లాగేసుకుంది.దాంతో పెద్ద ప్రమాదం తప్పిందే.

దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియా( Social media )లో వైరల్‌గా మారింది.

వైరల్ వీడియోలో ఒక వైట్ కారు వెనుక ఓ తల్లి తన ఇద్దరు పిల్లలతో కలిసి వెళ్లడం మనం చూడవచ్చు.ఆ కారు మధ్యలో చిన్న గ్యాప్ ఉంది, గ్యాప్ తరువాత మరో కారు ఉంది.ఇది ఒక పార్కింగ్ ప్లేస్ లాగా కనిపిస్తోంది.

ఆ రెండు కార్ల మధ్య నుంచి ఈ తల్లి తన కొడుకులను తీసుకు వెళ్లడం ప్రారంభించింది.అయితే సడన్‌గా ముందు ఉన్న కారు రివర్స్ కావడం స్టార్ట్ చేసింది.

ఆ కారు చాలా వేగమైన స్పీడ్‌తో వెనక్కి దూసుకెళ్లింది.అలాగే తల్లి చిన్న కొడుకును కారు ఢీ కొట్టింది.

ఆ సమయంలో పిల్లోడు కారు టైర్ కింద పడబోతుండగా తల్లి గమనించి పిల్లోడి చేతిని పట్టుకొని పక్కకి లాగేసింది.మరుక్షణమే కారు వెనకే ఉన్న మరొక కారుకు బలంగా గుద్దుకుంది.

దానివల్ల రెండు కార్లు స్వల్పంగా ధ్వంసమయ్యాయి.డ్రైవర్ ఏ సోయిలో ఉన్నాడో కానీ తల్లి అప్రమత్తంగా ఉండటం వల్ల ఆమె కొడుకు ప్రాణాలతో బయటపడ్డాడు.

ఎక్స్‌ ప్లాట్‌ఫామ్‌లో ఈ వీడియో బాగా పాపులర్ అయింది.బిడ్డను ఆపద నుంచి రక్షించే బలమైన ప్రవృత్తి తల్లికి ఉందని వీడియో చూసిన చాలామంది నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.

వీడియోకు “హీరో మామ్” అని ఒక క్యాప్షన్ జోడించారు.@Enezator ట్విట్టర్ పేజీ షేర్ చేసిన ఈ వీడియోను మీరు కూడా చూడండి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube