కేటీఆర్‎కు ఎమ్మెల్యే రఘునందన్ సవాల్

తెలంగాణ రాష్ట్రం ప్రవేశపెట్టిన బడ్జెట్ అంతా అంకెల గారడేనని దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు అన్నారు.రాష్ట్ర బడ్జెట్ వలన ఎవరికీ ఉపయోగం లేదన్నారు.కేంద్రం రూ.1.9 లక్షల కోట్లు ఇవ్వలేదని చెప్పడం సరికాదన్నారు.పాతబస్తీకి మెట్రో ఎందుకు రాలేదని ప్రశ్నించారు.

 Mla Raghunandan Challenge To Ktr-TeluguStop.com

ఐటీఐఆర్ పై మంత్రి కేటీఆర్ బహిరంగ చర్చకు రావాలని సవాల్ చేశారు.ఫస్ట్ ఫేజ్ లో ఫలక్ నుమా నుంచి ఉందానగర్ కు డబ్లింగ్ రైల్వే లైన్ వేయాలన్నారు.ఉందానగర్ నుంచి శంషాబాద్ ఎయిర్ పోర్టు వరకు కొత్త రైల్ మార్గం వేసి ఎలక్ట్రిఫికేషన్ చేయడానికి కేంద్రం రూ.85 కోట్లు ఇచ్చిందని తెలిపారు.ఇమ్లిబన్ నుంచి ఫలక్ నుమాకు మెట్రో ఎందుకు వేయలేదన్న రఘునందన్ రావు ఐటీఐఆర్ కోసం వేయాల్సిన రైలుమార్గం ఎందుకు వేయలేదని నిలదీశారు.ఈ క్రమంలో ఐటీఐఆర్ ఫస్ట్ ఫేజ్ కింద కేంద్ర నిధులపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube